
ముస్తాబాద్ లో యువకుడు ఆత్మహత్య
ముస్తాబాద్ //మన ప్రజావాణి
ముస్తాబాద్ మండల కేంద్రంలో బద్ది పడగ అజయ్ తండ్రి మల్లారెడ్డి (22) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్ కు అజయ్ ఉరి వేసుకొని కనపడ్డాడు. కుటుంబ సభ్యులు శోభసముద్రంలో మునిగిపోయారు.అతని మరణం తో మండలం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.