
*గుండెపోటుతో చెన్నారం సొసైటీ కార్యదర్శి మృతి*
* *ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా వైరాలో హఠాన్మరణం*
కుటుంబ సభ్యుల్లో నెలకొన్న విషాదం
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
ఖమ్మం నుంచి భద్రాచలం డిపో బస్సులో కూనవరం వెళ్తూ మార్గమధ్యలోని వైరాలో ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలంలోని చెన్నారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యదర్శి ఎస్వీ సత్యనారాయణ (64) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సత్యనారాయణ నేలకొండపల్లి మండలంలో అమ్మగూడెం లో భార్య పిల్లలతో నివాసముంటున్నారు. సోమవారం ఖమ్మం వచ్చి కూనవరం వెళ్లేందుకు భద్రాచలం వెళ్తున్న డీలక్స్ బస్సు ఎక్కారు. ఖమ్మం నుంచి భద్రాచలానికి టిక్కెట్ తీసుకున్నారు. వైరా బస్టాండ్ కు వచ్చిన తర్వాత పక్కనున్న తోటి ప్రయాణికుడితో పంటి నొప్పిగా ఉందని చెప్పి కొన్ని మంచినీళ్లు తాగారు. బస్టాండ్ నుంచి బస్సు జాతీయ ప్రధాన రహదారిలోని పోలీస్టేషన్ సమీపానికి వచ్చే సమయానికి శ్వాస ఆడక సత్యనారాయణ తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఆవెంటనే 108 వాహనంలో చికిత్స కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతిచెందాడు. సత్యనారాయణకు ఇంకా కేవలం ఏడాది మాత్రమే కార్యదర్శిగా సర్వీస్ ఉంది. ఏపీలోని కూనవరం ఆయన స్వస్థలం. అక్కడకు వెళ్తూ గుండెపోటుతో మార్గమధ్యలోని వైరాలో హఠాన్మరణం చెందారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆర్టీసీ బస్సు కండక్టర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వైరా పోలీసులు దర్శాప్త చేస్తున్నారు.