
*ఇందిరమ్మ ఇండ్ల పై ఎమ్మెల్యే కు వినతి పత్రం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జూన్ 28 (మన ప్రజావాణి)*:
గట్టుప్పల్ మండల అంతంపేట గ్రామంలో అంబేద్కర్ ఇండ్ల పోరాటాల సమితి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ముఖ్య ఉద్దేశం గత సంవత్సరం నుండి కలెక్టర్ కి, ఆర్డిఓ కి, ఎమ్మార్వో కి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మార్వో ఇంక్వైరీ పేరుట నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే స్పందించి వితంతువులకు, వికలాంగులకు, నిరుపేదలకు అందరికీ ఎమ్మార్వో తోటి పరిశీలన చేసి మాట్లాడి న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తేల్చూరు సైదులు, మాధగాని కోటమ్మ, ఐతరాజు కలమ్మ, నర్సమ్మ, సొప్పరి లక్ష్మమ్మ సురిగి రాములు సొప్పరి మల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.