Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

శ్రీ సరస్వతీ శుభోదయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ తంగాలపెల్లిలో ఈరోజు హరితహారం కార్యక్రమం

మన ప్రజావాణి// రాజన్న సిరిసిల్ల
. కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని 2015 జూన్ మూడో తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 24 శాతం ఉన్నటువంటి అటవీ శాతం బాగానే 33 శాతానికి పెంచడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యము దాన్లో భాగంగా ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల చేత మొక్కలు నాటించడం జరిగింది మొక్కల వల్ల ఉపయోగాలు చెప్పడం జరిగింది ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది అని చెప్పడం జరిగింది నీరు గాలి భూమి ఈ మూడు ప్రకృతి వనరులు ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుంది భవిష్యత్తులో మన పిల్లలకు ఏ ఒకటి లోపించిన మన పిల్లలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పడం జరిగింది . ప్లాంటే ట్రీ ప్లాంట్ లైఫ్ సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ అవర్ సెల్ఫ్. ప్లాంట్ ట్రీ సేవ్ అవర్ నేచర్ సేవ్ అవర్ హెల్త్ అని స్లొగన్స్ పిల్లలకు చెప్పడం జరిగింది హై స్కూల్ స్థాయి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు హరిత హరితహారం కార్యక్రమం పైన నిర్వహించడం జరిగింది . ఆషాడమాసంలో గోరింటాకు యొక్క ప్రాముఖ్యత పిల్లలకు చెప్పడం జరిగింది గోరింటాకు ఆషాడ మాసంలో చేతులకు కాళ్లకు పెట్టుకోవడం మూలంగా సూక్ష్మజీవుల నుండి రక్షించుకోవడంతో పాటు మనము ఆహారం తిన్నప్పుడు కడుపులోకి సూక్ష్మజీవులు వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి లతా రెడ్డి ప్రీపెయి మరి ఇంచార్జ్ పద్మశ్రీ సరిత కవిత కీర్తన పిఈటి అజయ్ కుమార్ శిరీష స్రవంతి కవిత మమత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share