హైదరాబాద్‌లో 8 మంది ఫేక్ డాక్టర్లు. ••తనిఖీల్లో గుర్తించిన టీజీఎంసీ

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

హైదరాబాద్‌లో 8 మంది ఫేక్ డాక్టర్లు.

••తనిఖీల్లో గుర్తించిన టీజీఎంసీ..

హైదరాబాద్//మన ప్రజావాణి

అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న 8 మంది ఫేక్ డాక్టర్లను గుర్తించామని, వారిపై ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సిటీలోని బౌరంపేట్, దుండిగల్,సూరారం ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు.. యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, ఐవీ ఫ్లూయిడ్స్ వంటి అధిక స్థాయి మందులను రోగులకిచ్చి హాని కలిగిస్తున్నారు.సమాచారం అందుకున్న టీజీఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరెంజ్ క్లినిక్ (ఎస్ కే. నగులమీరా), బీఎల్ఆర్ క్లినిక్ (డా. పి. సూర్యలత), నాని మినీ హాస్పిటల్ (కె. వెంకటేశ్), శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (వై. సూర్యనారాయణ), శ్రీ శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (శివ శంకర్), బాలాజీ క్లినిక్ (చి. విట్టల్), నందుశ్వర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (శంకర్ గౌడ్), మస్తాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (SK. మస్తాన్) సెంటర్లపై టీజీఎంసీ వైస్ చైర్మన్ డా.జి.శ్రీనివాస్, సభ్యుడు డా.విష్ణు బృందాలు దాడులు నిర్వహించాయి. అనంతరం నిందితులపై ఎన్ఎంసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు.నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే వాట్సప్ నంబర్ 91543 82727 ద్వారా తెలియచేయాలని ప్రజలను కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్