
*నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 10 (మన ప్రజావాణి)*:
గురువారం ఉదయం 10 గంటలకు చండూరు మున్సిపాలిటీ లో గత 5 సంవత్సరాలుగా లోవోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న కాలనీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అయ్యప్ప నగర్ , సర్దార్ కాలిని, హైద్రాబాద్ రోడ్ లో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడమైనది ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం
చేయడమైనది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ లు కల్మికొండ పారిజాత జనార్ధన్, నల్లగంటి మల్లేశం,గంట సత్యం, కల్లెట్ల మారయ్య, గండూరిజనార్ధన్, ఇరిగి వెంకటేశం, పన్నాల లింగయ్య, కృష్ణారెడ్డి, జవీద్, షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.









