
*నల్గొండ జిల్లా లో విషాదం వివాహిత ఆత్మహత్య*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 15 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా, చండూర్ మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 25 సంవత్సరాల యాదాస్ అమల అనే యువతి ఆదివారం సాయంత్రం 7:40 రాత్రి ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు యాదాసు తేజు 7సం. కూతురు యాదసు స్వాత్విక 5సం ఉన్నారు. ఆమె వివాహిత కాగా, ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఈ ఘటనపై షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య కాదు ఇది హత్య అని పలు అనుమానాలు ఉన్నాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.