
*గంజాయి నిందితులు అరెస్టు*
*పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 15 (మన ప్రజావాణి)*:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనలో బాగంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తన్ అనే కార్యక్రమం ద్వారా మాదకద్రవాలకు అలవాటు పడిన అనేక మందిని కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావడం జరిగింది.
దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల క్రయ, విక్రయాల పై ప్రత్యేక నిఘా పెట్టీ నమ్మదగిన సమాచారం మేరకు నల్లగొండ పట్టణంలో గత కొంత కాలం నుండి హైదరాబాద్ లోని ధూల్ పేట నుండి నల్లగొండ కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ వారు గంజాయి సేవిస్తూ మరియు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ధ నుండి సుమారు ఒక కిలోన్నర గంజాయిని స్వాధీనము చేసుకోనైనధి.
*నేరస్థుల వివరాలు*
ఎ-1. పెరిక కరణ్ జయరాజ్, గోపాల్, వయస్సు.50 సం||ములు, వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇంటి నెంబర్ 6-2-276, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ రోడ్, నల్గొండ పట్టణం. ఎ-2. యెల్లెంల శివ శంకర్, తండ్రి రాములు, వయస్సు47 సం||ములు, వృత్తి.ప్రైవేట్ టీచర్, వల్లాల గ్రామం, శాలిగౌరారం మండల్, నల్ల్గొండ జిల్లా
ఎ-3. పెద్దమాము వీరస్వామి తండ్రి వెంకటయ్య, వయస్సు.39 సంవత్సరములు, వృత్తి. మార్బుల్ వర్కర్, శెట్టిపాలెం గ్రామము, వేములపల్లి మండల్
*నేరస్తులు నేరం చేయు విధానం*:
పైన తెలిపిన నేరస్థుడు ఎ-1) పెరిక కరణ్ జయరాజ్ నల్లగొండ పట్టణము నంధు గత కొద్ది సంవత్సరములుగా రియల్ ఎస్టేట్ వ్యాపారము చేస్తున్నాడు. వ్యాపారములో బాగంగా ఎ-2. యెల్లెంల శివ శంకర్ మరియు ఎ-3. పెద్దమాము వీరస్వామి తో పరిచయము ఏర్పడి స్నేహంగా ఏర్పడినధి. వీరు గత రెండు సంవత్సరములుగా గంజాయి త్రాగుడుకు అలవాటు పడి హైదరాబాద్ లోని ధూల్ పేట లో గంజాయి కొనుక్కొని వచ్చి త్రాగుచుండేవారు. వీరు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గత ఆరు నెలలుగా ఎ-1 పెరిక కరణ్ జయరాజ్ డబ్బులు పెట్టుబడి పెట్టి ఎ-2. యెల్లెంల శివ శంకర్ ను హైదరాబాద్ కు పంపగా అతడు ధూల్ పేట లోని గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయి రూపాయలు 10,000/- లు కిలో చొప్పున కొనుగోలు చేసి రాగా వీరు ముగ్గురు కలిసి అట్టి గంజాయిని చిన్న పాకెట్లు గా తయారీ చేసి నల్ల గొండ లో గంజాయి తాగే వ్యక్తులకు ఒక్క పాకెట్ 500/- రూపాయల చొప్పున అమ్మేవారు. వీరి వలన నల్లగొండ పట్టణంలో యువత పెడదారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ రోజు అనగా తేధి 14-07-2025 రోజు ఉదయము వీరు ముగ్గురు కలిసి అట్టి గంజాయిని చిన్న పాకెట్లుగా తయారు చేస్తుండగా పోలీసు వారికి వచ్చిన నమ్మధగిన సమాచారము మేరకు వెళ్ళి వారి అరెస్టు చేసి వారి వద్ధ నుండి కిలోలోన్నర గంజాయి మరియు (03) సెల్ ఫోన్లు స్వాధీనము చేసుకోనీ నిందితులను నేడు రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇట్టి కేసును నల్గొండ డి.ఎస్.పి.కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ టు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవ రావు ఆద్వర్యంలో ఇట్టి నేరస్థులను పట్టుబడి చేసిన నల్గొండ II టౌన్ యస్.ఐ వై.సైదులు, వారి సిబ్బంది పాయిలి రాజు, బాలకోటి లను జిల్లా ఎస్పీ అభినందించనైనది.