మీ పిల్లలకు ఒక పాస్వర్డ్ చెప్పండి ••• ఢిల్లీలో ఆ పాస్వర్డ్ వల్లే తప్పించుకున్న విద్యార్థి. ••• పోలీసులకు చిక్కిన కిడ్నాపర్.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

మీ పిల్లలకు ఒక పాస్వర్డ్ చెప్పండి

••• ఢిల్లీలో ఆ పాస్వర్డ్ వల్లే తప్పించుకున్న విద్యార్థి.

••• పోలీసులకు చిక్కిన కిడ్నాపర్.

//మన ప్రజావాణి ///

స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం. డిల్లీ లోని ఒక స్కూల్ లో తల్లి చెప్పిన పాస్వర్డ్ వల్లే విద్యార్థి చాకచక్యంగా తప్పించుకున్న జరిగిన సంఘటన.ఢిల్లీ లో ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే, ప్రతిరోజూ ఆ అమ్మాయి ని తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేది.కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది. ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేట్ బయట వేచి చూస్తూ ఉంది.
దీనిని ఆసరాగా తీసుకొన్న ఒక వ్యక్తి , ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి “మీ అమ్మకు వేరే అర్జంట్ వర్క్ ఉండటం వల్ల ఇప్పుడు స్కూల్ దగ్గరకు రాలేకపోయింది, అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది “ అని ఆ అమ్మాయితో చెప్పాడు.వెంటనే ఆ అమ్మాయి, “సరే మా అమ్మ నన్ను తీసుకురమ్మని, నిన్ను పంపించినట్లయితే మా అమ్మ నీకు చెప్పిన పాస్ వర్డ్ చెప్పు“ అని అడిగింది.వాడికేమీ అర్థం కాలేదు…అటూ ఇటూ చూసి తడబడ్డాడు.ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై, గట్టిగా అరిచే లోపుగా వాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు.ఈ మధ్యకాలంలో మాయమాటలు చెప్పి, స్కూల్ పిల్లల కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతుండటంతో, ఆ అమ్మాయి తల్లి, తన కూతురికి ఒక పాస్ వర్డ్ ను చెప్పింది.స్కూల్ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే, వాళ్ళను ఆ పాస్ వర్డ్ ను అడగమని చెప్పింది.అప్పుడు ఆ పాస్ వర్డ్ వాళ్ళు చెప్పలేకపోతే, కిడ్నాపర్ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది.తన తల్లి చెప్పిన ఈ ఉపాయం వల్ల, ఆ అమ్మాయి కిడ్నాపర్ ల బారి నుండి తప్పించుకోగలిగింది.తల్లిదండ్రు లందరూ తమ పిల్లలకు ఈ పాస్ వర్డ్ విధానాన్ని పాటిస్తే చాలా వరకు కిడ్నాపర్ల బారి నుండి తమ పిల్లలను రక్షించుకోవచ్చు.ఇది మికు కూడా ఉపయోగపడుతుందని *మన ప్రజావాణి* ఆరాటం. మనం లేని సమయంలో కూడా ఆ పాస్వర్డ్ రక్షించగలుగుతుందని మాయొక్క సూచన.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్