సంక్షేమ పథకాలలో పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ••• 10 సంవత్సరాలుగా లబ్ధిదారులకు రేషన్ కార్డు లు ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ. •••పుట్టే బిడ్డ వరకు అప్పుచేసిన కేసీఆర్. •••ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకలనే కాంగ్రెస్ ఆలోచన.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

సంక్షేమ పథకాలలో పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

••• 10 సంవత్సరాలుగా లబ్ధిదారులకు రేషన్ కార్డు లు ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ.

•••పుట్టే బిడ్డ వరకు అప్పుచేసిన కేసీఆర్.

•••ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకలనే కాంగ్రెస్ ఆలోచన.

•••ప్రతి ఒక్క లబ్ధిదారులకు రేషన్ కార్డు లు అందుతుంది.

••••ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏ ఏం ఆర్ గార్డెన్ లో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డు లు పంపిణి.

ముస్తాబాద్//మన ప్రజావాణి

ప్రతి పేదవాడు ప్రతిరోజు పండగల జీవించాలనే ఆలోచనతో సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ పరుగులు పెట్టిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి, అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పొందాలనే ప్రతి నిరుపేద కుటుంబానికి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచనతో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏఎమ్ఆర్ గార్డెన్ లో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డి సి ఎస్ ఓ రజిత, ఏసీఎస్ఓ శ్రీలత, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి -నరింహులు,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,ముఖ్య అతిథులు గా విచ్చేశారు. ఈ సందర్బంగా చక్రధర్ రెడ్డి, బాల్ రెడ్డి మాట్లాడుతూ….. గత10 సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క అర్హునికి రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను పొందాలని గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారని తెలిపారు. ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు జారీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇవ్వాలనినే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే పథకాలను చూసి బిజెపి బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడని అన్నారు. రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, మండలానికి 574 ఇందిరమ్మ ఇండ్లు,మంజూరు చేశారాని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల నుండి రుణాలు, వడ్డీ లేని రుణం సన్న బియ్యం, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గజ్జెల రాజు, రాంరెడ్డి,రెవిన్యూ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share