
జర్నలిజానికి నైతిక దిక్సూచి మల్లవజుల వంశీ.
మన ప్రజావాణి ప్రతినిధి కమాన్ పూర్ జూలై 20.
జర్నలితానికి నైతిక దీక్షకి మల్లవజుల వంశీ అని సివిల్ సొసైటీ ఫోరం సభ్యులు కొనియాడారు.రామగిరి మండలం సేంటినరీ కాలనీలో జరిగిన సమావేశంలో మల్లవజల వంశీకి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ సివిల్ సొసైటీ ఫోరం కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వంశీ జర్నలిజంలో నైతిక విలువలను అమలు చేస్తూ మీడియాను ప్రజల సమస్యలపై స్పందించే ప్రాథమిక వేదికగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో పెద్దపెల్లి జిల్లా ప్రెస్ చక్కటి పరిణామాలను నిలబెడుతుందని ఫోర్త్ ఎస్టేట్ కు స్ఫూర్తిదాయక దారి చూపుతోందని ప్రశంసించారు. సమాజానికే చైతన్యం కలిగించే లక్ష్యంతో వంశీ చేస్తున్న కృషి అభినందనీయమని జర్నలిజం గౌరవాన్ని రక్షిస్తూ ప్రజాస్వామిక కావ్యంతో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు.తనకు ఆత్మీయ సత్కారం చేసిన సిఎస్ఎఫ్ సభ్యులకు వంశీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముత్యకుర్తి చంద్రమౌళి,లక్కం బిక్షపతి,వనం శివానందం,బల్ల శివశంకర్,తోట వేణు,పల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025