డిజిటల్ అనువర్తనాల రైతు శిక్షణ అవగాహన

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

డిజిటల్ అనువర్తనాల రైతు శిక్షణ అవగాహన.

••• టి.ఆర్.వి.కే- డాట్ సెంటర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం.

చందుర్తి //మన ప్రజావాణి

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీ ఆర్ వి కే -డాట్ సెంటర్) కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజు చందుర్తి మండలంలోని ఆసిరెడ్డిపల్లె గ్రామంలో “వ్యవసాయంలో డిజిటల్ అనువర్తనాలు” మీద రైతు శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (జిల్లా ఏరువాక కేంద్రం/డాట్ సెంటర్), కరీంనగర్ శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తు, వాతావరణ సంబంధిత అంశాలను, చీడ పీడల యాజమాన్యం మార్కెట్ సంబంధిత అంశాల గురించి ఉన్న చోటనే మొబైల్ ని ఉపయోగించి సమాచారాన్ని ఏ విధంగా పొందాలో రైతులకు వివరించారు. అదే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ప్రసారమవుతున్న పి.జె.టీ.ఏ.యు – అగ్రికల్చర్ వీడియోస్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ చేనుకబుర్లు అను రేడియో కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. అలాగే వ్యవసాయం లో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ మీడియా ఉపయోగించి అధునాతన సమాచారాన్ని పొందాలని వివరించారు. అదే విధంగా వివిధ మొబైల్ అనువర్తనాలు, పోర్టల్స్ ని ఉపయోగించి వాతావరణ సంబంధిత విషయాలను తెలుసుకునే విధానాన్ని రైతులకు వివరించారు. తదనంతరం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కోఆర్డినేటర్ డా. హరికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, ముఖ్యంగా అధిక వర్షాల వలన ప్రత్తిలో పార విల్ట్ గమనించడం జరిగింది. దీని నివారణకు ప్రత్తి పంటలో ఆగి ఉన్న నీటిని కాలువల ద్వారా బయటకి పంపించి, కాపర్ ఆక్సి క్లోరైడ్ మందుని 3 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుని మొక్క మొదళ్లు తడిచే విధంగా పిచికారీ చేయాలి. అలాగే 19:19:19 లేదా 13:0:45 వంటి పోషకాలను కూడా పిచికారీ చేసినట్లయితే ప్రత్తి మొక్కలు తొందరగా కొలుకుంటాయి. తదుపరి డా.ఏం. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… మొగి పురుగు నివారణకు చేపట్టవలసిన చర్యలను తెలియజేయడం జరిగింది. పిలక దశలో మొగి పురుగు ఆశిస్తే మొక్కలు ఎండి చనిపోతాయి. చిరు పొట్ట దశలో తెల్ల కంకులు ఏర్పడుతాయి. ఉదృతి ఎక్కువ గా ఉంటే కార్టాఫ్ హైడ్రో క్లోరైడ్ 400 గ్రా ఎకరానికి లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 60 మి.లీ. ఎకరానికి పిచికారి చేసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రైతులందరికీ చేరాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పకుండా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి. అనూష గారు సూచించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తల బృందం రైతులు సాగు చేస్తున్న వరి ప్రత్తి పంటలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ , ఏ ఏం సి వైస్ చైర్మన్ మల్లేశం, పంచాయతీ సెక్రటరీ మహేష్, రావెప్ విద్యార్థినులు, రైతులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్