
*గుడుంబా స్థావరాల పై ఎక్సైజ్ అధికారుల దాడులు*
మన ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట
మండలంలోని కిష్టునాయక్ తండా,అల్మాస్ పూర్ తండా,బుగ్గ రాజేశ్వర తండాలలో గురువారం రోజున ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 300 లీటర్ల సారా తయారీ పానకం ధ్వంసం చేసి 20 కిలోల బెల్లం,10 కిలోల పటిక,20లీటర్ల గుడుంబా స్వాధీన పరచుకొని మూడు కేసులు నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడులలో డీటీఎఫ్ ఎస్సై శైలజ,ఎక్సైజ్ సిబ్బంది,రాజు,కిషోర్,మల్లేష్,వర్మ,హమీద్,సుమన్,రాకేష్,పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో నాటు సారా అందుకు సంబంధించిన ముడి సరుకులు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.









