
*బ్యాంకు ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన తోటి ఉద్యోగులు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 31 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా చండూరు మండలంలోని పోచంపల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్ చండూరు శిఖనందు జరిగిన సమావేశంలో బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతం ప్రజలు బ్యాంక్ అందించే ఫిక్స్డ్, డిపాజిట్స్, రుణ సౌకర్యం, లాకర్, బ్యాంకు గ్యారంటీ సేవలు ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కోరడమైనది. అలాగే గత నెలలో బ్యాంక్ సిబ్బంది తిరందాస్ శివప్రసాద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించినందుకు వారి కుటుంబ సభ్యులకు బ్యాంక్ యాజమాన్యం ఇబ్బంది తరఫున వారికి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, సీఈవో సీత శ్రీనివాస్, మేనేజర్ లు రాజు, స్వామి, సిబ్బంది, రావిరాల నాగేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.









