వేములవాడలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని హోటల్ సిజ్.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

వేములవాడలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని హోటల్ సిజ్.

•••రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం నోటీసులు.

•••• 30 వేల రూపాయల భారీ జరిమానా..!!

•••జిల్లాలోని పలు రెస్టారెంట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక దాడులు.

రాజన్న సిరిసిల్ల //మన ప్రజావాణి

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ తర్వాత ఉన్నతాధికారులు, డైరెక్టర్ ఐపిఎం డాక్టర్ సి శివలీల ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పి. రోహిత్ రెడ్డి, ఎస్ శ్రీషిక ,పి.స్వాతి,వి.అంకిత్ రెడ్డి లతో కూడిన బృందం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల కేంద్రంలో గల తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఆకస్మికంగా తనిఖీ చేయగా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేయడం, కిటికీలకు మెష్ లేకపోవడం,పెస్ట్ కంట్రోల్ పాటించకపోవడం,అపరిశుభ్రంగా ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్లలో నిలువ చేసిన దుర్వాసనతో కూడిన మాంసపు ఉత్పత్తులను భారీ మొత్తంలో గుర్తించడం జరిగింది. ఎగ్జాస్టర్ ఫాన్స్ పై నూనెతో కూడినటువంటి నూనె, దుమ్ము ధూళితో పేరుకుపోవడం, ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ క్యాప్ హ్యాండ్ గ్లోవ్స్ ధరించకపోవడమ్,అపరిశుభ్ర ప్రాంతంలో మూతలు తీసిన దుమ్ము ధూళి ఈగలతో కూడిన వండిన ఆహార పదార్థాలను, కుళ్లిపోయిన ఉడికిన గుడ్లు, హానికర రసాయనాలతో కూడినటువంటి కృత్రిమ రంగులను బిరియాని ఇతర ఆహార తయారీకి ఉపయోగించడన్ని గుర్తించడం జరిగింది. రెస్టారెంట్ నందు 20 వేల 500 రూపాయల విలువ గల సుమారు 70 కిలోల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన టీ పౌడర్, ఇతర ముడి సరుకులు, లేబుల్ డిఫెన్స్ కలిగినటువంటి కాజు, మసాలా పొడులు, మిగిలి ఉంచిన బిర్యాని, ఇతర ఆహార పదార్థాలను ప్రజల ఆరోగ్య నిమిత్తం హోటల్ యాజమాన్యాన్ని ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ హెడ్ వి.జ్యోతిర్మయి హెచ్చరించి అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది. ఎఫ్ఎస్ఎస్ 2006 చట్టం ఉల్లంఘించినందుకుగాను వారికి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా మునిసిపల్ అధికారుల సమన్వయంతో హోటల్ నందు పూర్తిగా అపరిశుభ్ర వాతావరణ ఉన్నందున ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 మున్సిపల్ చట్టం 2019 ని ఉల్లంఘించినందుకు గాను వేములవాడ మున్సిపల్ అధికారులచే 30 వేల రూపాయల జరిమానా విధించి రెస్టారెంట్ ను తదుపరి రెక్టిఫికేషన్ చర్యల నిమిత్తం తాత్కాలికంగా మూసి వేయించడం జరిగింది. అదేవిధంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గల రుచి హోటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయగా అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం, ఫుడ్ హ్యాండ్లర్స్,గ్లౌజ్ మరియు హెయిర్ క్యాప్స్ ధరించకపోవడం, పండిన ఆహారంపై మూతలు కప్పకపోవడం, ఈగలతో కూడిన ఆహారం ఉండడం, మూతలతో కూడిన డస్ట్ బిన్స్ వాడకపోవడం, పెస్ట్ కంట్రోల్ లేకపోవడం, స్టోర్ రూమ్ లో వంటకు ఉపయోగించేటువంటి నాణ్యతలేని ముడి సరుకులు ఉండడం, కుళ్ళిపోయిన ఫంగల్ ఇన్ఫెస్తేడ్ కాలిఫ్లవర్ క్యారెట్ మరియు ఇతర కూరగాయలు ఆహార తయారీకి ఉపయోగించడం కాలం చెల్లిన ముడి సరుకులు, హోటల్ యాజమాన్యం కలిగి ఉండాల్సినటువంటి తగిన రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం తో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం 2006 ఉల్లంఘించినందుకు గాను, వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అనుమానిత ఆహార పదార్థాల శాంపులను సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్ లో గల ల్యాబ్ కు పంపించడం జరిగింది. అదేవిధంగా వెయ్యి రూపాయల విలువగల 5 కిలోల పురుగులతో కూడిన మైదాపిండి, కుళ్లిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ముడి సరుకులను ప్రజల ఆరోగ్యం నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది. నిబంధనలు పాటించని, ప్రభుత్వ అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి తేల్చిచెప్పారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు సూచించడం జరిగింది,అలాగే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share