కలెక్టర్ ఆర్డర్ ను పట్టించుకోరా…? •••ప్రజావాణి పిర్యాదు లో బయటపడ్డ నిర్లక్ష్యం. •••ఆర్డివో తిరుపై క్లాస్ పీకిన జిల్లా కలెక్టర్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

కలెక్టర్ ఆర్డర్ ను పట్టించుకోరా…?

•••ప్రజావాణి పిర్యాదు లో బయటపడ్డ నిర్లక్ష్యం.

•••ఆర్డివో తిరుపై క్లాస్ పీకిన జిల్లా కలెక్టర్.

రాజన్న సిరిసిల్ల//మన ప్రజావాణి

గత కొంతకాలంగా పట్టా చేయ్యమని బాధితులు వేడుకుంటున్న నిర్లక్ష్యం చేస్తూ కలెక్టర్ ఆదేశాలను సైతం దిక్కరించిన సిరిసిల్ల ఆర్డీఓకు క్లాస్ పీకిన కలెక్టర్.

*బాధితులు తెలిపిన వివరాల ప్రకారం*…

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కోలకాని శంకరయ్య,కొలకాని లస్మయ్య ఇద్దరు అన్నదమ్ములు వీరికి వ్యవసాయ పొలం సర్వే నం (471) లో 28 గుంటలు ఉండగా శంకరయ్య కు తెలవకుండా లాస్మయ్య పెద్దకొడుకు రవి 1996 ఏప్రిల్ 24 నా అక్రమంగా పట్టా చేసుకున్నాడు. గత ప్రభుత్వ హయాంలో 2016 ధరణిలో అక్రమంగా పట్టా చేసుకున్నట్టు బయటపడ్డది. 2016 నుండి 2025 వరకు ఎవరి గేట్లు వాళ్ళు పెట్టుకుని సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే దొంగ పట్టా చేసుకున్నట్లు ఎంక్వయిరీలో తేలింది.అక్రమంగా చేసుకున్న పట్టాను అక్టోబర్లో అధికారులు క్యాన్సల్ చేశారు.గత ఏడాది శంకరయ్య సమస్య తీర్చాలంటూ ప్రజావాణి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.వెంటనే తహసీల్దార్ ఎంక్వయిరీ చేయగా అది దొంగ పట్టా అని తేలింది. దీంతో కలెక్టర్ లాస్మయ్య, శంకరయ్య వారసత్వ భూమిని సమానంగా పట్టా చేయాలని ఆదేశాలు చేశారు. ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ ఇరువురి సభ్యుల నుండి ఎలాంటి అభ్యంత్రాలు ఉన్నాయో లేవో అని ఎంక్వయిరీ చేసుకొని సిరిసిల్ల ఆర్డివో కు పంపరు. బాధితులను గత నాలుగు నెలల నుండి శంకరయ్య కు పట్టా కాకుండా లాస్మయ్య ఇబ్బందులు పెడుతున్నారు అంటూ సోమవారం ప్రజావాణిలో బాధితులు శంకరయ్య మళ్ళీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎందుకు పట్టా చేయడం లేదంటూ అధికారులు నిర్లక్ష్యం చెయ్యడం పై ప్రజావాణి లో వచ్చిన పిర్యాదు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు కలెక్టర్ క్లాస్ పీకినట్లు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైన కలెక్టర్ ఆర్డర్ లను దిక్కరించి ప్రజల సమస్యలపై అధికారులు నిర్లక్ష్య వహిస్తున్న అధికారులపై కలెక్టర్ తీరు పై పలువురు అభినందిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share