
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరేష్టు
కోరుట్ల,ఆగష్టు 04 (ప్రజా వాణి) పట్టణంలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తి ని కోరుట్ల పోలీసులు అరేష్టు చెసి అతని వద్ద నుంచి నిషేధిత గాంజాయి 150 గ్రాములు,సెల్ ఫోన్ సిజ్ చెసినట్ల స్వాధీన పరుచుకుని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలుపారు.
కోరుట్ల ఎస్సై చిరంజీవి తెల్పిన వివరాల ప్రకారం
సొమవారం రోజున నమ్మదగిన సమాచారం మేరకు వెటర్నరీ కాలేజ్ దగ్గర ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడునీ ఎస్ఐ చిరంజీవి తమ సిబ్బంది తోపాటు, ఇద్దరు గవర్నమెంట్ పంచుల సమక్షంలో కోరుట్లలోని వెటర్నరీ కాలేజ్ దగ్గర తనిఖీ చేస్తుండగా, ఎండి ఫయాజుల్ రెహమాన్ అరబన్ కాలానికి చెందిన అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతని వద్ద నిషేధిత గాంజా సుమారు 150 గ్రాములు (దాని విలువ సుమారు 5000/-), స్వాధీన పరుచుకుని ,అతని యొక్క సెల్ ఫోను చీజ్ చేసి,
కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరాలించారుని పేర్కొన్నారు ఫయాజులకి గంజాయి సప్లై చేసిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడుని తెలుపారు.కోరుట్ల ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎవరైనా గాంజా ఉపయోగించిన త్రాగిన, వినియోగించిన, రవాణా చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోని పీడీ యాక్ట్ కూడా నమోదు చెస్తారుని పేర్కొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025