విద్యతోనే ఉన్నత స్థానాలు సాధించవచ్చు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి. రియల్ హీరో లను కాదు రియల్ హీరోలను ఆదర్శంగా తీసుకోవాలి.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

విద్యతోనే ఉన్నత స్థానాలు సాధించవచ్చు.

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి.

రియల్ హీరో లను కాదు రియల్ హీరోలను ఆదర్శంగా తీసుకోవాలి.

కోదాడ ఆగస్ట్ 04/ మన ప్రజావాణి

తమ విద్యార్థి జీవితంలో విద్యార్థులు రియల్ హీరోలైన తల్లిదండ్రులు, టీచర్లు, దేశ క్షేమం కోసం కృషి చేసే సైనికులు, రైతులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజీ లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ , పేరెంట్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ జీవితంలోనే విద్య తోనే ఉన్నత స్థానాలు, మర్యాద, గౌరవం లభిస్తాయన్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ నుండి 6 సంవత్సరాల పాటు కష్టపడితే వారి జీవిత గమనం సాఫీగా సాగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు ఆకర్షణలకు లోను కాకుండా, ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కష్టపడాలని కోరారు. తమ పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు కష్టపడతారని, వారి కష్టాన్ని గమనించి భవిష్యత్తులో వారికి కష్టాలు లేకుండా పిల్లలు చదువుకోవాలన్నారు. విద్యార్థులు కస్టపడి కాకుండా ఇష్టపడి చదువున్నప్పుడే వారు మంచి ఫలితాలు సాధిస్తారని, విద్యార్థులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ కాలేజీ లో విద్యార్థులకు చదువు పై ఇష్టాన్ని పెంచే విధంగా విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాలేజీలో నిర్వహించిన పరీక్షలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ జీ. వీ, అకడమిక్ డైరెక్టర్ మైనం రామయ్య, పలువురు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్