
ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అరకొరగా పరీక్షలు..?
మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటి బాట పడుతున్నా సిబ్బంది..!
జిల్లా కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని బాధితుల మొర..?
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో కొందరు సిబ్బంది నిర్వాకం వలన మధ్యాహ్నం వరకు పరీక్షలు నిర్వహించి ఆ తరువాత పరీక్షల కేంద్రాలకు తాళాలు దర్శనం ఇవ్వడం తో బాధితులు బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల మండలాల నుండి వందలాది మంది నిత్యం వైద్యసేవలకు ప్రధాన ఆస్పత్రికి వస్తూ పోతూ ఉంటారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేసే కొన్ని కేంద్రాలు తాళాలు దర్శనం ఇవ్వడంతో రోగులు నిత్యం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పాత బిల్డింగ్ మరియు కొత్త బిల్డింగ్ లో కూడా ఐ సి టి సి విభాగానికి తాళాలు దర్శనం ఇవ్వడంతో రోగులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ స్పందించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు బంధువులు కోరుతున్నారు. నిత్యం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సుమారు 1500 నుండి 2000 వరకు వివిధ వైద్య సేవలు పొందేందుకు బాధితులు సుదూర ప్రాంతాల నుండి ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నట్లు ఆ మేరకు పరీక్షలు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసీజీ ఇతర కొన్ని పరీక్షల వద్ద మహిళా సిబ్బంది లేకపోవడంతో కొందరు మహిళ రోగులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.









