
బర్త్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన ఘటన.
తాహసిల్దార్ లీలకు బిత్తర పోయిన మహిళ..?
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
కూసుమంచి మండలం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన వింత సంఘటన. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి మాద విద్య అనే బాలిక బర్త్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఆగస్టు 4వ తేది బర్త్ సర్టిఫికెట్ కోసం కార్యాలయానికి వెళ్లగా డెత్ సర్టిఫికెట్ అందించారు. బాలిక తల్లి మమత సర్టిఫికెట్ ను కాసేపు ఆగి ఫోన్లో ఫొటో తీసుకున్న అనంతరం పరిశీలించగా బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు గమనించి అధికారులను నిలదీసింది. రెవిన్యూ రికార్డులలో కాదు సాక్షాత్తు బాలిక బర్త్ సర్టిఫికెట్ బదులు చనిపోయిన సర్టిఫికెట్ అందజేయడం ఎంతవరకు సబబు. అంటే ఏ రికార్డులు పరిగణలోకి తీసుకొని ఆ సర్టిఫికెట్ జారీ చేశారో రెవెన్యూ అధికారికే ఎరుక అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.









