
*ప్రజల్లో చైతన్యానికే పోలీసు భరోసా*
*-సీఐ రజిత రెడ్డి*
అనంతగిరి, ఆగష్టు 6 (మన ప్రజావాణి ):
అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బొజ్జగూడెం తండా గ్రామంలో అనంతగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి మరియు అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ హాజరై గ్రామప్రజలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించి పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలి, సమస్యలు సృష్టిoచవద్దు అని అన్నారు.ఈ కార్యక్రమం నందు ప్రజలకు చట్టాల అమలు, జైలు శిక్షలు, వ్యక్తుల సత్ప్రవర్తన అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సి ఐ రజిత రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ప్రజా భరోసా కార్యక్రమాల సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చామని, ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని, క్షణికావేశంతో స్వార్థంతో అత్యాశతో ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని నేరాలకు పాల్పడవద్దని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్రామంలో నిఘా ఉంచాం అన్నారు. గ్రామం శాంతియుతంగా ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని యువత భవిష్యత్తులో సన్మార్గంలో నడుస్తారని అన్నారు. సైబర్ మోసాలు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. మహిళలను గౌరవించాలని మహిళల పట్ల దాడులకు పాల్పడకూడదని కోరారు. నేర్వాలకు పాల్పడం వల్ల జీవితం జైలు పాలవుతుందని చట్టాలు బలోపేతంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025