
జయశంకర్ జీవితం స్ఫూర్తిదాయకం.. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి ఆగస్టు 06
కామారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం రోజున ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. అని మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ తోపాటు సిబ్బందులు రాజు, మనోజ్ కుమార్, జుక్కల్ గ్రామ యువకులు విజయ్ కుమార్,కృష్ణ, ఆశు ఖాన్, ఇస్మాయిల్, బాబర్ , షాకీర్ తదితరులు పాల్గొన్నారు.









