
*నేషనల్ హైవే కట్టకోమ్ముగూడెం జంక్షన్ వద్ద తప్పిన పైను ప్రమాదం*. . *పాలకుల వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న 8 గ్రామాల ప్రజలు*. . . *ప్రజల ప్రాణాలు కోల్పోతున్న కదలని అధికారులు*. . . *సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ ఆగస్టు6(మన ప్రజావాణి) : నేషనల్ హైవే 65 కట్టకోమ్ముగూడెం జంక్షన్ వద్ద 8 గ్రామాలు రామాపురం,నర్సింహపురం, రామ్ నగర్,ఆర్లెగూడెం,రామచంద్రానగర్ ,బేతవోలు,పాత కోండాపురం,మాదవగూడెం ప్రజలతో నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రాంతంలో బైకుపై వెళ్ళుతున్న వ్యక్తికి తప్పించబోయి కారు ప్రక్కనే ఉన్న గుంతలో పడిపోయింది.కారులోని బెలున్లు తెరుచుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది.ఇప్పటికైనా సూర్యాపేట జిల్లాలో ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, కలెక్టర్ స్పందించి కట్టకోమ్ముగూడెం జంక్షన్ వద్ద అండర్ గ్రౌండ్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని పై 8 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.









