
*వైద్య ఆరోగ్యశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇష్టారాజ్యం…?
*జిల్లా ఇంచార్జ్ అధికారి అండదండలతో మూడేళ్లుగా వీధుల నిర్వహణ…!
*మెడికల్ బిల్లుల చెల్లింపుల దస్త్రాలు అటెండర్ చేతికి..?
*అకౌంటెంట్ విభాగంలో దర్జాగా కూర్చొని మెడికల్ బిల్లుల చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ..?
*గతంలో అవినీతి ప్రకంపనలు.. కొంతకాలం వేరే విధులు నిర్వహణ..?
*అంతా తెలిసే జరుగుతోందా..?
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి ప్రత్యేక కథనం..1
ఖమ్మం జిల్లా జనరల్ హాస్పిటల్ లో ఓ ల్యాబ్ దగ్గర అటెండర్ గా +సహాయకుడిగా) విధులు నిర్వహించాల్సిన ఓ చిరు ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఏకంగా జిల్లా జనరల్ హాస్పిటల్ మెడికల్ బిల్లుల రియంబర్మెంట్స్ గరిష్టంగా 50 వేల రూపాయలకు వైద్య కళాశాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో విధులు నిర్వహించే పర్మినెంట్ ఉద్యోగులు వైద్యుల వైద్య ఖర్చులకు గాను ప్రైవేటు ఆసుపత్రులు కార్పొరేట్ దవాఖానాల్లో చికిత్స పొందితే ప్రభుత్వము నుండి నగదు పొందేందుకు డిఎంఇ అకౌంటెంట్ విభాగంలో సదరు చిరు ఔట్సోర్సింగ్ అటెండర్ దర్జాగా కుర్చీలో పాగా వేసి అకౌంటెంట్ విభాగంలోని సూపరింటెంట్ కు ఉద్యోగులు వైద్యుల నుండి అందే మెడికల్ బిల్లుల దస్త్రాలను సేకరిస్తూ రికార్డులలో నమోదు చేస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాల క్రితం ఔట్సోర్సింగ్ విభాగంలో అటెండర్ గా నియామకమైన సదరు ఉద్యోగి జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పటల్లో ప్రభుత్వానిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్ ఉద్యోగుల వైద్యుల మెడికల్ రియంబర్స్మెంట్ విధులను నిర్వహించడం పట్ల ఇటీవల ఇన్చార్జిగా వ్యవహరించిన ఓ ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు అదే పలుకుబడి పరపతితో నిత్యం విధులు నిర్వహిస్తున్నట్లు పలువురు ఉద్యోగులు సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా వివిధ విభాగాలలో పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులు మెడికల్ బిల్లుల వ్యవహారంపై కార్యాలయంలో సంప్రదిస్తే సదరు ఔట్సోర్సింగ్ అటెండర్ అన్ని తానై సమాధానాలు చెప్తారని ఆ చిన్న సారు వచ్చేదాకా ఎంత పెద్ద ఉద్యోగులైన ఎదురుచూడాల్సిందేనని ఒకవేళ ఫోన్ చేసినా కానీ నిర్లక్ష్యంగా అమర్యాదగా ప్రవర్తిస్తూ జులుం చూపిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఔట్సోర్సింగ్ ద్వారా నియామకమైన సదరు అటెండర్ ఆపరేషన్ థియేటర్ల వద్ద సహాయకారిగా పని చేయాల్సి ఉండగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాస్థాయి అధికారుల అండదండలతో అకౌంటెంట్ కార్యాలయంలోవిధులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఇటీవల ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ఎక్సోలేటర్లు వ్యవహారం మరవక ముందే జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ప్రధాన విభాగంలో ఔట్సోర్సింగ్ అటెండర్ మాయాజాలం వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తుంది. గతంలో సదరు అటెండర్ పై ఫిర్యాదులు రావడంతో కొంతకాలం వేరే విధులు అప్పగించిన జిల్లా అధికారులు అంతా నిశ్శబ్దం అయిన తర్వాత మళ్లీ యధావిధిగా పాత విధులను నిర్వహించేందుకు కుర్చీని ఏర్పాటు చేసి మరీ బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు అసహనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ విచారణ చేసి చర్యలు తీసుకుంటారో లేక ఆనవాయితీ కొనసాగిస్తున్నారోనని పలువురు గుసగుసలాడుతున్నారు.
అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రధానమైన విభాగాలలో పని చేయవచ్చా? ఒకవేళ అటువంటి పనులు చేయాలంటే ఎవరు చేయాలి ప్రభుత్వ నిబంధనలు ఏమిటి..? జిల్లాస్థాయి అధికారులు.. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వివరణలతో రేపటి రెండవ కథనంలో వేచి చూడండి…!









