నాణ్యతలేని ఆహారం ప్రిన్సిపాల్, వార్డెన్లపై వేటు* *మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ పాటించని ఇన్స్టిట్యూషన్లపై చట్టపరమైన చర్యలు*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*నాణ్యతలేని ఆహారం ప్రిన్సిపాల్, వార్డెన్లపై వేటు*

*మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ పాటించని ఇన్స్టిట్యూషన్లపై చట్టపరమైన చర్యలు*

*విద్యార్థులకు గురువే దైవం*

*విద్యార్థుల బాధ్యత ప్రిన్సిపాల్, వార్డెన్ లదే*

భద్రాద్రి జిల్లా బ్యూరో/భద్రాచలం ఆగస్టు 06, (మన ప్రజావాణి): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న గురుకుల కళాశాల, పాఠశాలలు, ఈఎంఆర్ఎస్, డిగ్రీ, ఎస్ఓఈ, సిఓఈ కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులకు సరఫరా చేస్తున్న అల్పాహారం భోజనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా సంబంధిత ప్రిన్సిపాల్ లు, వార్డెన్లు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు ఐటిడిఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురుకులం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఇన్స్టిట్యూషన్ల ప్రిన్సిపాల్ లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 రోజులుగా గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులకు సరఫరా చేసే ఆహారం విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని, మన ఇన్స్టిట్యూషన్లలో చదివే గిరిజన విద్యార్థులు చాలా బీదవారని, తల్లిదండ్రులను వదిలేసి మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి వారి భవిష్యత్తు అంతా మీ మీదనే వదిలేసి చదువుకుంటున్నారని అటువంటి విద్యార్థుల ఆహార పానీయాలు, ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధచూపి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఎవరైనా విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురైయితే మీ ఆధీనంలో ఉన్న ఏఎన్ఎంతో చికిత్సలు చేయించి మూడు రోజులు దాటింది అంటే మాత్రం వెంటనే మీ దగ్గరలో ఉన్న పిహెచ్సి కి తీసుకొని పోయి వైద్య పరీక్షలు చేయించాలని, ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నందున పిల్లల ఆరోగ్య విషయంలో ఇన్స్టిట్యూషన్లలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు విషపూరితమైన కీటకాలు సంచరిస్తూ ఉంటాయని, అందుకు పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే ప్రిన్సిపాల్ వార్డెన్ మరియు సిబ్బంది క్వార్టర్స్ లో ఉండే ఫ్యామిలీస్ పిల్లలందరూ కలిసి ఒక శ్రమదానం రూపంలో పనులు చేసుకుంటే పరిసరాలు అన్ని శుభ్రంగా ఉంటాయని అన్నారు. ప్రత్యేకించి పిల్లలతో మాత్రం పనులు చేయించకూడదని అన్నారు. కొన్ని ఇన్స్టిట్యూషన్లలో సిబ్బంది ఆధిపత్యం కోసం ఇటువంటి పరిణామాలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చిందని, ఎవరిని ఉపేక్షించమని పిల్లల చదువు విషయంలో మాత్రం అందరూ సమానంగా పనిచేయాలని అన్నారు. ఇన్స్టిట్యూషన్లో ఇటువంటి పరిణామాలు జరగడం వలన పిల్లల యొక్క చదువు సక్రమంగా జరగదని అన్నారు. ఏదైనా ఇన్స్టిట్యూషన్లో మెనూ ప్రకారం పిల్లలకు సమయానుకూలంగా ఆహారం వడ్డించకపోతే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఇనిస్టేషన్లో ప్రిన్సిపాల్ ప్రత్యేక బాధ్యత వహించాలని, వార్డెన్ సిబ్బంది అందరూ ఐకమత్యంగా ఉండి పిల్లలకు వడ్డించే ఆహారంలో అల్పాహారం నుంచి మొదలుకొని మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ వరకు ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున నియమించి పిల్లలకు వడ్డించే ఆహారాన్ని ముందుగా వారు తిన్న తర్వాత సర్టిఫై చేసిన 15 నిమిషాలకి పిల్లలకు పెట్టాలని, అయినా పిల్లలు అస్వస్థతకు గురి అయినట్టు నాదృష్టికి వస్తే సర్టిఫై చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు. ప్రతిరోజు వంట చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించి, వంట పాత్రలు, వంటగది, డైనింగ్ హాల్ శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఏజెన్సీల ద్వారా సరఫరా చేసే కూరగాయలు మరియు జిసిసి ద్వారా సరఫరా చేసే బియ్యం పప్పులు, ఉప్పులు, పల్లి పట్టి నాణ్యతగా ఉన్నవి తీసుకోవాలని, నాసిరాంకంగా ఉన్నట్టు తెలిస్తే వెంటనే ఆర్సిఓకి తెలియజేయాలని అన్నారు. ఇనిస్టిషన్లో మైనర్ రిపేర్లు ఏమైనా ఉంటే తప్పకుండా చేయిస్తామని, కొన్ని ఇన్స్టిట్యూషన్లలో మంచినీటి సమస్య మరియు కోతుల బెడద ఉన్నట్టు తెలిసిందని, గ్రామపంచాయతీ వారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేలా చూస్తానని అన్నారు. ప్రిన్సిపాల్ మరియు వార్డెన్ ఉపాధ్యాయులు సిబ్బంది మరియు ఏఎన్ఎంతో సహా అందరూ స్థానికంగా ఉండాలని అన్నారు. గత సంవత్సరం ఆశ్రమ పాఠశాలల కంటే గురుకుల పాఠశాలల్లో పదవ తరగతి ఫలితాలు చాలా నిరాశ కలిగించాయని, ఈ సంవత్సరం అలా జరగకుండా పదో తరగతి సబ్జెక్టులో వెనుకపడ్డ పిల్లలను ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నైట్ స్టడీస్ తప్పనిసరిగా జరగాలని, గత సంవత్సరం కెరీర్ గైడెన్స్ పై పిల్లలకు వివిధ శాఖల అధికారులతో అవగాహన కల్పించడం జరిగిందని, చాలావరకు పిల్లలు అవగాహన పెంచుకున్నారని, సంవత్సరం 8, 9, 10వ తరగతి పిల్లలకు నెలకి రెండవ శుక్రవారం, నాలుగో శుక్రవారం తప్పనిసరిగా ఏదో ఒక శాఖ నుండి ఒక అధికారిని పిలిపించి వారికి అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్, వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share