సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం.

••• ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి.

••• పలు పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన.

రాజన్న సిరిసిల్ల //మన ప్రజావాణి

సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని భవిష్యత్తులలో సైబర్ నేరాల కట్టడిలో విద్యార్థులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోని పలు పాఠశాల విద్యార్థులకు పోలీస్ అధికారులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తులో విద్యార్థులే సైబర్ నేరాల కట్టడిలో కీలక పాత్ర పోషిస్తారని సూచించారు. యూపీఐ లావాదేవీలు, మోసాలు, క్రెడిట్ కార్డులు,డెబిట్ కార్డుల, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను సరైన సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని అన్నారు. వాట్సాప్ లింకుల్లో కేవైసీ లింకుల ద్వారా సైబర్ నేరాలకు పాలు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు పిర్యాదు చెయ్యాలని సూచించారు. సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

*ఇల్లంతకుంట*…

ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని టీజీ ఎంఎస్ పాఠశాలలో స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యూపీఐ లావాదేవీల జరిగే మోసల పై అవగాహనా కల్పించారు.

*ఎల్లారెడ్దిపేట్*…

ఎల్లారెడ్డిపేట మండలంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ముఖ్యంగా ఏపీకే ఫైల్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, లోన్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సైబర్ మోసగాళ్ల నుండి విద్యార్థులు ఎలా సురక్షితంగా ఉండగలరని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లను సరిగ్గా నిర్వహించడం సురక్షితంగా ఉపయోగించడం మొదలైన వాటి గురించి ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి అవగాహన కల్పించారు.

*తంగళ్లపెల్లి*…..

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వివేకానంద కాలనీలో సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై హెడ్ కానిస్టేబుల్ జక్కుల నాగరాజు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

*గంభీరావుపేట*…..

గంభీరావుపేట మండలం లోని కేజీబీవీ పాఠశాలలో స్థానిక ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లను సరైన ఉపయోగించుకోవాలని అన్నారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లావాదేవిల పై జరిగే మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

*రుద్రంగి*…. రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ కళశాలలో స్థానిక ఎస్సై శ్రీనివాస ఆధ్వర్యంలో సైబర్ నెరాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రతి ఒక్క విద్యార్థి సైబర్ నేరాలు పై అవగాహన కలిగి ఉండాలని, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లావాదేవిలపై అప్రమత్తగా ఉండాలని సూచించారు. కేవైసీ లింకుల ద్వారా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు.సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు రిపోర్ట్ చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share