
*నల్గొండ జిల్లాలో ఫుడ్ సప్లై అధికారుల నిర్లక్ష్యమే కారణం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 21 (మన ప్రజావాణి)*:
నల్గొండ జిల్లా లో కొన్ని కిరాణా షాపులలో ఎక్స్పరి డేట్ అయిపోయిన వస్తువులను అమ్ముతున్న జిల్లా ఫుడ్ సప్లై అధికారులు పట్టించుకోవడం లేదు. గురువారం ఒక మండలానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా దుకాణం వద్ద ఒక అబ్బాయి చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవడం జరిగింది. ఆ చిప్స్ ప్యాకెట్ ఎక్స్పరి డేటు అయిపోయిందని అబ్బాయికి తెలవకపోవడం తో చిప్స్ తినడం జరిగింది. చిప్స్ తిన్న కొద్దిసేపటికి వాంతింగ్ చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రులు గమనించి దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్లడంతో డాక్టర్ ఎక్స్పెరి డేటు అయిపోయిన చిప్స్ తినడం వల్ల ఇలా జరిగిందని తెలిపారు. దీనికి కారణం జిల్లా ఫుడ్ సప్లై అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని పలువురు అంటున్నారు.