
*గట్టుప్పల్ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్లు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 25 (మన ప్రజావాణి)*:
సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సంబంధించిన గట్టుప్పల్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎం అమృత, కే సంతోష ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17200 మంది రేషన్ డీలర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్లకనుగొనంగా డీలర్లు ఏప్రిల్ 2025 మే నెలల వారీగా బియ్యం పంపిణీ చేసినారు ఆ తర్వాత జూన్ 25 జూలై ఆగస్టు మూడు నెలలు ఉచిత బియ్యాన్ని కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాల్లో ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అత్యంత పారదర్శకంగా పనిచేయడం జరిగింది. ప్రభుత్వ గత ఐదు నెలలుగా డీలర్లకు కమిషన్ విడుదల చేయడం లేదు ఏ నెల కమిషన్ ఆ నెలలో డీలర్ల ఖాతాలో జమ చేయని కారణంగా డీలర్లు అనేక ఇబ్బందులకు గురవుతూ అప్పుల పాలవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కమిషన్లు వేరువేరుగా కాకుండా పాత పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమిషన్ ఒకేసారి విడుదల చేసి డీలర్ల ఖాతాలో జమ అయ్యేవిధంగా చూడాలని అంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గట్టుప్పల్ మండల అధ్యక్షులు ఎం అమృత, ప్రధాన కార్యదర్శి కె సంతోష, సంఘం సభ్యులు బి రవి, ఎం వెంకటేష్, సిహెచ్ జంగయ్య, వి వెంకటేష్, జి వెంకటమ్మ, తదితరులు పాల్గొనడం జరిగింది.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025