
కోదాడ లో కాఫీ కార్నర్ కేఫ్ ప్రారంభం
యువత స్వయం ఉపాధిలో రాణించాలి........
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.....
కోదాడ, ఆగస్టు 25/ మన ప్రజావాణి.
కోదాడ ప్రజలకు అందుబాటులో కాఫీ కార్నర్ కేఫ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కాఫీ కేఫ్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఉన్నత తమకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి వ్యాపారంలో రాణించి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. నమ్మకమైన సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. అనంతరం కేఫ్ నిర్వాహకులు ఎండి జానీ పాషా కు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు షేక్ షఫీ, దండా వీరభద్రం, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025