
ఆది కర్మయోగి అభియాన్ ,
ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం ఆగస్టు 26
ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ రంపచోడవరం వారి ఆదేశముల మేరకు ,
సోమవారం ఉదయం 9:00 గంటల దేవీపట్నం మండలం ఇందుకూరుపేట వెలుగు కార్యాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి ఎస్.సాల్మన్ రాజు ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిచే ప్రవేశపెట్టబడిన ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం కార్యా చరణ ప్రణాళికలో భాగముగా గిరిజన ప్రాంతములలో నివసించుచున్న ఆదివాసి ప్రజల సాధికారత, గిరిజన ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల మొదలైన అంశములపై గిరిజన ప్రజలలో అవగాహన కల్పించుట, విద్య ,వైద్యం ఆరోగ్యం, గృహ నిర్మాణం, స్త్రీ మరియు శిశు సంక్షేమం, మొదలైన ప్రభుత్వ సేవలు గిరిజన ప్రజలకు అందించడంలో ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బంది వహించవలసిన బాధ్యతలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరినీ సమన్వయ పరుచుటకు
బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనీలచే పంచాయితీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి ఒకరోజు ఆది కర్మయోగి అభియాన్ వర్క్ షాపు విజయవంతముగా నిర్వహించడ మైనది.
సదరు వర్క్ షాప్ కార్యక్రమంలో బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనీస్ అయిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ లు, మండల విద్యాధికారి, మండల వ్యవసాయ అధికారి, ఏ.పీ.ఓ, ఎన్ఆర్ఇజిఎస్, ఏ పి ఎం వెలుగు, స్థానిక పీ.హెచ్ సి.వైద్యాధికారిణి, మొదలగువారు హాజరు అయినారు.
సదరు వర్క్ షాప్ పూర్తయిన అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మరియు వివిధ ప్రయోగాత్మక యాక్టివిటీలు నిర్వహించడమైనది.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025