
*పేస్ అటెండెన్స్ ఉండదు… సంతకం లేకపోయినా..?
*హాజరు మాత్రం యధావిధిగా..!
*నాడు పంచాయతీ కార్యదర్శులు నేడు వైద్య అధికారులు సిబ్బంది..?
*12 టీములు ఆ పథకం కింద పని చేస్తాయా..?
*టీంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ వివరణ డ్యూటీ కి రాలేదు.. వివరాలు కనుక్కుంటా..?
*ఆన్లైన్ ఇంటిలో చేశారట సిగ్నల్ ప్రాబ్లం తో.. మరి విద్యార్థుల ఆరోగ్య మెట్ల..?
చిత్రం మాత్రం పాతది… విధులకు డుమ్మా మామూలే..?
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి ప్రత్యేక కథనం
విధులకు హాజరు కారు… రికార్డులలో మాత్రం సంతకాలు ఉండవు.. పేస్ అటెండెన్స్ ఉండదు… సెలవు చీటీ కనపడదు. కానీ అదో కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ విద్యార్థులకు పరీక్షలు చేసి సూచనలు ఇస్తూ మందులు పంపిణీ ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం తో ప్రజాధనం దుర్వినియోగం తో పాటు దర్జాగా వేతనాలు పొందుతున్న ఆరోపణలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఓ మండలంలో వినిపిస్తున్నాయి. మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి వీరభద్రం సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ మండలంలో ఆర్బీఎస్కే పథకం కింద ఖమ్మం జిల్లాలో12 టీములు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హాస్టల్స్ మరియు కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్ లో ముందుగా వేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడి జిల్లా ఉన్నత పరిషత్ ప్రాథమిక ఇతర విద్యాసంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను పరీక్షలు చేసి సూచనలు అందిస్తూ మందులు పంపిణీ చేయాల్సిన బృహత్తర కార్యక్రమం. ఈ పథకం కింద ఒక మహిళ డాక్టర్ పురుష డాక్టర్ తో పాటు ఏఎన్ఎం ఫార్మసిస్ట్ గ్రూపుగా టీం గా ఏర్పడి యాక్షన్ ప్లాన్ ప్రకారం వైద్య సేవలు అందించాల్సి ఉండగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఓ ఉద్యోగి అండదండలతో విధులకు హాజరుకాకుండా పాత చిత్రాలు తో హాజరైనట్లు జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి విధులకు ఎగనామం పెడుతూ ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్న సంబంధిత అధికారులకు తెలిసి జరుగుతుందని కొందరు దృష్టికి రాలేదని మరికొందరు వ్యాఖ్యానించటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క టీంకు ఓ డాక్టర్ నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. కానీ ఆ మండలంలో ని ఓ కస్తూర్బా గాంధీ హాస్టల్లో విద్యార్థులను ఖమ్మం కేంద్రానికి తరలించి అవసరమైన విద్యార్థులకు వైద్య సేవలు సూచనలు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఓ టీం లో పనిచేసే సదరు ఫార్మాసిస్ట్ ఖమ్మం పట్టణంలోని చర్చి కాంపౌండ్ సమీపంలోని గేటు వద్ద స్థానికంగా నివాసం ఉంటూ ఆ ఇల్లును ఖాళీ చేసి ఇందిరానగర్ సమీపంలోని ఇంటికి మారినట్లు ఆ పని మేరకు విధులకు ఎగనామం పెట్టి ఆన్లైన్ డ్యూటీ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు సదరు టీం వైద్యాధికారి వివరణ ఇవ్వటం విశేషం. పైగా రిఫరల్ డే రోజున ఫార్మాసిస్టుకు ఎటువంటి డ్యూటీ ఉండదని యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కోసం ఇంటి వద్ద నుండి ఇంటర్నెట్ సిగ్నల్ రాకపోవడంతో ప్రభుత్వ సేవ చేసినట్లు ధృవీకరణ ఇవ్వడం నిర్లక్ష్యాన్ని బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. సొంత పనులకు ఆర్బిఎస్కే వాహనాల వినియోగం కాలం చెల్లిన వాహనాలను పక్కనపెట్టి మరమ్మత్తుల పేరుతో డీజిల్ బడ్జెట్ నొక్కేస్తూ వ్యవహరిస్తున్న అవినీతి అధికారులు కొందరు పాత డీఎంహెచ్వో కార్యాలయం సమీపంలోని వాహనాన్ని సైతం అక్కడి నుండి గుట్టు చప్పుడు కాకుండా మరో చోటుకు తరలించినట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ మండల కేంద్రం పరిధిలో ఓ టీం ఓ కస్తూర్బా గాంధీ హాస్టల్ నుండి విద్యార్థులను తీసుకొని వచ్చి రిఫరల్ డేకు తరలించినట్లు తెలిసింది. ప్రతి సోమవారం ఈ టీంకు రిఫరల్ డే గా ఉంటుందని తెలిసింది. ఈ సందర్భంగా ఓ డాక్టర్ ఓ ఏఎన్ఎం మాత్రమే హాజరైనట్లు మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి వీరభద్రం ఆధారాలను సేకరించి సదరు వైద్యాధికారిని సంప్రదించగా పొంతన లేని సమాధానాలు వివరణలు తో పాటు ఏప్రిల్ నెలలో యాక్షన్ ప్లాన్ ఆరు నెలలుగాను ముందుగానే ప్రకటిస్తారని ఆ మేరకు ఆ టీములు వైద్య సేవలు అందించాలని నిర్ణయించినప్పటికీ కొందరు వైద్యాధికారులు తో పాటు ఫార్మసిస్టులు అక్కడక్కడ పలుకుబడి కలిగిన ఏఎన్ఎంలు దర్జాగా విధులకు ఎగనామం పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు విధులకు ఎగనామం పెట్టి సాంకేతికతను ఉపయోగించి మస్టర్లలో రికార్డులలో నమోదు చేసుకున్న పంచాయతీ కార్యదర్శులు పై ఇటీవల కలెక్టర్ చర్యలు తీసుకున్న ఉదంతం మరవకముందే అత్యంత కీలకమైన ప్రజా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది విధులకు ఎగనామం పెట్టి పాత చిత్రాలతో దర్జాగా కొనసాగిస్తున్న వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.
డిఐఓ వివరణ తో పాటు.. మరికొన్ని వివరాలతో వార్త కథనం రేపటి కథనంలో..2 వేచి చూడండి…!