*తప్ప తాగి హెడ్ కానిస్టేబుల్ విధుల నిర్వహణ

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*తప్ప తాగి హెడ్ కానిస్టేబుల్ విధుల నిర్వహణ*

స్టేట్ బ్యూరో మన ప్రజావాణి

ఓ హెడ్ కానిస్టేబుల్ త‌ప్ప తాగి కేసు విష‌య‌మై విచార‌ణ‌కు వెళ్ల‌గా మ‌త్తులో ఉన్న అత‌డిని గ్రామ‌స్తులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అయింది. పెన్‌ప‌హాడ్ మండ‌లం అనాజీపురం గ్రామంలో ఇద్ద‌రి పాలివారి మ‌ధ్య కొంత‌కాలంగా వ్య‌వ‌సాయ భూమి పంచాయ‌తీ కొన‌సాగుతుంది. ఇరు వ‌ర్గాలు ఒక‌రి పైప్‌లైన్‌ను మ‌రొక‌రు ధ్వంస చేశార‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. విచార‌ణ‌లో భాగంగా హెడ్ కానిస్టేబుల్ ఆంగోతు యాద‌గిరి బుధ‌వారం గ్రామానికి వెళ్లాడు. వ‌చ్చిన ప‌ని ప‌క్క‌న పెట్టి ఫుల్లుగా మ‌ద్యం సేవించి మ‌త్తులో తూలుతున్నాడు. బాధితులు చెప్పేది విన‌కుండా పంచాయ‌తీకి సంబంధం లేని స‌మాధానం చెప్ప‌డంతో అక్క‌డికి వ‌చ్చిన పెద్ద మ‌నుషులు విస్తు పోయారు. మ‌త్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌ను గ్రామ‌స్తులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా గ్రామ‌స్తులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్