*కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల తో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గవర్నర్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల తో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గవర్నర్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (మన ప్రజావాణి)*:

నల్గొండ జిల్లాను టీబి రహిత, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం అయన మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నాల్గవ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదీత్య భవన్లో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముందుగా రాష్ట్ర గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ…… నల్గొండ జిల్లాలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో వైటిపిఎస్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య, విద్య, జల్ జీవన్, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ పథకం, సమగ్ర శిక్ష అభియాన్, భవిత కేంద్రాలు గ్రామ సడక్ యోజన, టి బి ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఆబ జన జాతీయ యోజన, ఆది కర్మయోగి అభియాన్, తదితర పథకాల పై లెక్కలతో సహా వివరించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతల పై వివరాలను తెలియజేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు లయన్ డిస్టిక్ గవర్నర్ మదన్ మోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, వైద్యులు జయప్రకాశ్ రెడ్డి, సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా, కవి సగర్ల సత్తయ్య, దుశ్చర్ల సత్యనారాయణ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణ కాంత్ నాయక్, రైతు రాంరెడ్డి,పదవతరగతి జిల్లా టాపర్ విద్యార్థిని అమూల్య, హెచ్ఐవి పై పనిచేస్తున్న సంఘసంస్కర్త మేరీ తదితరులు వారు చేస్తున్న రంగాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు. జిల్లా అధికారులతో ముఖాముఖి సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాసులు జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, చికిత్స, తదితర అంశాలను వివరించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ క్షయ వ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో టీబీ పట్ల అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నివారణకు సొసైటీలో అందరినీ భాగస్వామ్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కవులు, కళాకారులు , రచయితలు వివిధ రంగాలలోని ప్రముఖులను టీబి ముక్త్ భారత్ లో భాగస్వాములను చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబి ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డికి సూచించారు. టి బి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబి ముక్త్ భారత్ కార్యక్రమానికి భారత ప్రధాని సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, గ్రామాలలో సర్పంచ్ లను చురుకుగా పాల్గొనే విధంగా చూడాలని, కవులు, కళాకారులు, రచయితల ద్వారా సాంఘిక నాటకాలు, నాటికలు, పద్యాలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని, టీబి కి వ్యతిరేకంగా అందర్నీ భాగస్వాములు చేయాలని సూచించారు. అలాగే నల్గొండ జిల్లాలో గాంజా ఎక్కువ మొత్తంలో ఉందని తెలుసుకొని గాంజా నిర్మూలనలో సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ రెండు అంశాలపై తో పాటు, మహిళా సాధికారతకు కృషి చేయాలని, ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. కళాకారులు, కవులు, పర్యావరణవేత్తలు సైతం టీబీ ముక్తు భారత్ లో పనిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయ వీసీలు మొదలుకొని కింది స్థాయి వరకు అందరూ భాగస్వాములు అయితే టీబి, మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించవచ్చని, అప్పుడు నల్గొండ జిల్లాను టీబి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్ద వచ్చని అన్నారు. ముఖ్యమైన పథకాల అమలులో గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి మారుమూల గిరిజన ప్రాంతాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో చివరి మనిషి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖులు వారు సొసైటీకి ఏం చేయగలమో ఆలోచించాలని, ఈ విషయంపై ఎంపీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని పునరుద్గాటించారు. నల్గొండ జిల్లాలో వైద్యం, ఆరోగ్యం, విద్య పథకాల అమలు పట్ల ఆయన జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. అలాగే పోషణ అభియాన్ తో పాటు, ఇతర పథకాలు బాగా అమలు చేస్తుండడం పట్ల కితాబునిచ్చారు. పౌష్టికాహారం టి బి నివారణ, మాదకద్రవ్య నివారణ, తదితర పథకాలలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంపీ రఘువీర్రెడ్డిలు రాష్ట్ర గవర్నర్ ను శాలువా, మేమేంటోతో సత్కరించారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు నల్గొండ జిల్లాలో టీబి నివారణకు ముఖ్యుల సలహాలు తీసుకోవడమే కాకుండా, జిల్లా యంత్రాంగంతో కలిసి పని చేస్తామని అన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్ద రైస్ మిల్లు ఇండస్ట్రీ ఉందని, దీనివల్ల వాతావరణ కాలుష్యం ,టీబి వంటి వ్యాధులు సోకడానికి ఆస్కారం ఉందని ,ఆ ప్రాంతంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి టీబి నివారణకు కృషి చేస్తామన్నారు. అలాగే పట్టణాలలో గాంజా వాడకం ఎక్కువగా ఉందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, డిఎఫ్ఓ రాజశేఖర్ ,రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు , తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share