
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా
సేవా పక్షోత్సవాలు ఘనంగా చెయ్యాలి
మఠం శాంతకుమారి
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు
ప్రజావాణి ప్రతినిధిపాడేరు సెప్టెంబర్ 15 :
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సేవా పక్వాడా కార్యశాల బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మఠం శాంతకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బీజేపీ ఎన్డీయే ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75 వ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు పక్షం రోజు చెయ్యలని ఇందులో జిల్లా స్థాయిలో రక్త దాన కార్యక్రమంలో 17 న ,ఉచిత వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంప్ లు ,పాఠశాల ,దేవాలయాలు ,ఆసుపత్రిలో స్వేచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్నారు,అదేవిధంగా అమ్మ పేరుతో మొక్కలు నాటాలిఅన్నారు,సెప్టెంబర్ 25 న దీన్ దయల్ ఉపాధ్యాయ జీవితం పై సెమినార్ నిర్వహించాలి అన్నారు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా చెయ్యాలి అన్నారు, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు పాంగి రాజారావు, సేవా పక్వాడా జిల్లా కో కన్వీనర్ రవికుమార్ పెనుమాక, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నందోలి ఉమా మహేష్,సల్లా రామకృష్ణ,సేవా పక్వాడా మండల ఇంచార్జీ కుడుముల వెంకట రమణ,సరభ వేమనబాబు, మత్యకొండబాబు, లకే భాస్కర్,పాపిటి రాజు,లకే అబ్బాయి దొర తదితరులు పాల్గొన్నారు.








