
కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..!
నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…?
కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ?
పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…!
వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..?
మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1
స్టేట్ బ్యూరో ప్రతినిధి (మన ప్రజావాణి)
చైతన్యమంతమైన ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ వైద్య సేవలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి దర్జాగా కార్పొరేట్ శక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కట్టడాలు నిర్మాణం చేస్తున్న సంబంధిత కార్పొరేషన్ శాఖ అధికారులు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కార్పొరేట్ ఆసుపత్రి అట్టగోలుగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఖమ్మం నగర ప్రజలు విమర్శిస్తున్నారు. కరోనా కల్లోలంలో దండిగా దండుకున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎక్కడో మారుమూల పల్లె కాదు గిరిజన తండా కు గ్రామం అంతకంటే కాదు జిల్లా కేంద్రంలో అధికారుల ఉదాసీనత చర్చనీయాంశంగా మారింది.. మరికొన్ని వివరాలతో.. వరుస కథనాల పరంపర రేపటి కథనం..2లో.. వేచి చూడండి…!








