
భారీ ఘరానా మోసం
కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో..!
ఖమ్మం కి చేరిన పంచాయతీ..?
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఇల్లు ఉందట.. కోదాడలో కూడా..?
మన ప్రజావాణి న్యూస్ డెస్క్
(హైదరాబాద్)
కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం గ్రామం కందిమల్ల బంజర చెందిన కట్ట శీను మెడికల్ రిప్రజెంట్ చేస్తూ,గొర్రెల లోను,ఇప్పిస్తానంటూ.
అoగోతు రంగా,రాజు గూడెం చెందిన అతనిని,పరిచయము చేసుకొని అతని తోటి అనుచరులు దగ్గర మాయ మాటలు,చెప్పివారిని,నమ్మబలికించి.దాదాపు 30 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి కనీసం 50 వెయ్యిలు 1.లక్ష 2.లక్షలు తీసుకొని సుమారు 26 లక్షలు వసూలు చేసి అక్కడి నుంచి ఖమ్మంకు పరారయ్యాడు.ఖమ్మంలో అతను నివసించే,ఇంటికి బాధితులు ఆంగోతు రంగ, భూక్య భువనేశ్వరి, గుగులోత్ తులసిశ, గుగులోత్ తరుణ్,భూక్య జ్యోతి,తేజావత్ కవిత భూక్య రాజేశ్వరి.అంగోతు లక్ష్మి కొమ్ము ప్రేమ్ కుమార్, రాయల నరసింహారావు అన్నెం,నాగిరెడ్డి,భూక్య శంకర్,శారద నిందితుడు ఇంటికి చేరగా నాకు ఖమ్మం లో ఇల్లు ఉంది ఇల్లు అమ్మి మీ డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికిస్తూ వాయిదాలు వేసుకుంటూ పబ్బం,గడుపుతున్నాడు. అతనకు ఇల్లు ఉన్నదో లేదో అని బాధితులు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఈసీ పరిశీలించగా అతను సంవత్సరం కిందట ఇల్లు అమ్మినాడని తెలిసినది. అతనిపై బాధితులు ఆగ్రహించి గొడవ చేయగా వారినుంచి,తప్పించుకొనుటకు మరొకసారి నాకు మేళ్లచెరువులో రెండో ఇల్లు ఉన్నది. అంటూ మారి యొక్కసారి తప్పించుకొనుటకు ప్రయత్నం చేయగా అతని మాయమాటలతో నిరసన చెందిన బాధితులు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ అతను తీసుకెళ్లగా ఆంధ్ర తిరువూరు నియోజకవర్గం చెందిన అతను కాబట్టి అతనిపై ఆంధ్రాలో ఎఫ్ ఐ ఆర్ చేయండి.అప్పుడు అతనిపై మేము చర్య తీసుకొని ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అతను అప్పగిస్తామంటూ. తెలంగాణ పోలీసులు వారికి నచ్చజెప్పి ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు.
అయినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలోని కూటమి ప్రభుత్వం హయాములో కూడా పలుమార్లు బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఫోన్ లైన్ లో అందుబాటులో లేకుండా మధ్యవర్తులను సైతం మోసం చేయడంతో బాధితులు మోసం చేసిన సదరు వ్యక్తి నివాస గృహం ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేయడంతో స్పందించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తీసుకున్నట్లు బాధితులు ద్వారా తెలుస్తోంది
ఇప్పటికైనా ఆంధ్ర తెలంగాణ పోలీస్ అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.









