
కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ప్రధాన ఉద్దెశం
ప్రజల ఆశయాలను నెరవేర్చగల ఏకైక శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది టీపీసీసీ ఉపాధ్యాయులు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అబ్జర్వర్ నరేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆ త్రం సుగుణక్క శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్న ఈ సమావేశంలో అబ్జర్వర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ..జిల్లా కాంగ్రెస్ కమిటీలను మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం, కార్యకర్తలతో సమన్వయం పెంచడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నాయకత్వ మార్పుతో పాటు ప్రతి కార్యకర్తకు బాధ్యతాభారాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు.
తర్వాత టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ పార్టీ ఆలోచనలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు, మహిళలకు మరింత అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చగల ఏకైక శక్తిగా ఉన్నదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజర్ లు పులి అనిల్ కుమార్, అదువాల జ్యోతి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దండే విట్టల్, డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









