
70 ఏళ్ల బ్యాంకు సేవలో... ఎంత జీరో అకౌంట్ అయితే మాత్రం ఇదేం నిర్వాకం..?
ప్రభుత్వ కస్తూర్బా హాస్టల్ లో 10వ తరగతి చదివినప్పుడు అకౌంట్ ఇచ్చారు..
ఆ తర్వాత ఇదే అకౌంట్ నెంబర్ అంటూ నిర్వాహకులు తెలిపారు.
సంవత్సరాలు గడిచిపోయాయి.. ఇంటర్ మీడియట్ లో అదే అకౌంట్ అని ఇచ్చారు
తీరా డిగ్రీకి వచ్చిన తర్వాత.. ఎం జె పి రఘునాథపాలెం డిగ్రీ కళాశాలలో వెరిఫై చేయగా రిఫరెన్స్ నెంబర్ తో ఇచ్చారు..
అంటూ సమాధానం..?
ఇదే విషయంపై ఎస్బిఐ బోనకల్ బ్యాంకు మేనేజర్ గోపి వివరణ ఇస్తూ కలెక్టర్ మీటింగ్ లో ఉన్నారట..
రేపు రావాలట.. వినియోగదారులకు మెరుగని సేవలు ఒట్టిదేనా..?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని కస్తూర్బా హాస్టల్ లో 10వ తరగతి చదివిన నేపథ్యంలో ఆనాటి నిబంధనల ప్రకారం జీరో అకౌంట్ తీయాలని కస్తూర్బా గాంధీ ఎస్ ఓ ఆదేశాల మేరకు విద్యార్థిని బోనకల్ మండలం బోనకల్ సెంటర్లో ఎస్బిఐ వినియోగదారుల సేవా సంస్థ లో సంబంధిత పత్రాలు అందజేసి జీరో అకౌంట్ తీశారు. అకౌంట్ నెంబర్ లేకుండా రిఫరెన్స్ నెంబర్ తో ఎలా చెల్లుబాటు అవుతుందని విద్యార్థిని తండ్రి ప్రశ్నించినప్పటికీ ఇదే అకౌంట్ గా ఉంటుందని ఆ నెంబర్ మారదని సమాధానం ఇచ్చారు. తదనంతరం పదో తరగతి పరీక్షలు అయిపోయాయి విద్యార్థిని ఉత్తీర్ణత సాధించి ఖమ్మంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు. అదే సందర్భంలో అదే రిఫరెన్స్ ఇచ్చిన గుర్తింపును ఆ కళాశాల వాళ్లు వినియోగించుకొని ప్రభుత్వ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేశారు. మూడేళ్ల పొద్దు గడిచింది.. ఆ కళాశాల నిర్వాహకులు కూడా గుర్తించలేకపోయారు. కానీ విద్యార్థిని తల్లిదండ్రుల నుండి ఫీజులు మాత్రం వసూలు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి ఏ గ్రేడ్ లో ఆ విద్యార్థిని ఉత్తీర్ణత పొంది డిగ్రీ కళాశాల ప్రవేశానికి ఎం జె పి రఘునాథపాలెం గురుకుల కళాశాలలో సీటు పొందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రైతులు స్కాలర్షిప్ ఇతర అవసరాల రీత్యా ఎం జె పి రఘునాథపాలెం కళాశాల సిబ్బంది ధ్రువీకరణ పత్రాలు అందజేసిన సందర్భంలో రిఫరెన్స్ నెంబర్ తో ఉండటంతో బ్యాంక్ అ కౌంట్ చెల్లుబాటు కాదని తెలిపారు. పలుచోట్ల ఖమ్మం పట్నంలో విచారణ చేసిన అనంతరం మళ్లీ బోనకల్ ఎస్బిఐ మేనేజర్ ను కలవాలని సూచించారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని తండ్రి మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి బ్యాంకు మేనేజర్ ను గోపి నీ వివరణ కోరగా కలెక్టర్ గారి మీటింగ్లో ఉన్నాను . రేపు తీసుకొని రండి చూద్దామంటూ అన్నారు. 70 సంవత్సరాల వినియోగదారుల సేవలో ఎస్బిఐ ఉంటుందని ప్రకటనలు తప్ప ఓ విద్యార్థిని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్వీస్ సెంటర్ ఎస్బిఐ బోనకల్ శాఖపై పరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ సేవ అందించాల్సిన బ్యాంక్ అధికారులు సర్వీస్ సేవా నిర్లక్ష్యం ఎలా ఉంటే ఆ బ్రాంచ్ పరిధిలో ఎంత అమోఘమైన సేవలు చేస్తున్నారు అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025