
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివేక్
కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్
హుస్నాబాద్ అక్టోబర్ 15÷
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల శివారులోని జిల్లెల గడ్డ గ్రామంలో ఈనెల 7న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సానాదుల వివేక్ మృతికి సంబంధించి ఈరోజు హుస్నాబాద్ మండల బిజెపి నాయకులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి ప్రమాద పరిస్థితిపై ప్రిన్సిపాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదం ఎలా జరిగింది అని అడిగి మృతి చెందిన వివేక్ కుటుంబానికి న్యాయం చేస్తున్నారా లేదా అని ప్రిన్సిపల్ను ప్రశ్నించారు అయితే బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ మాట్లాడుతూ మరణించిన వివేక్ మృతిపై విచారణ కమిటీ తొందరగా చర్యలు చేపట్టాలని దోషులు ఎవరు నిర్ధారించుకొని విచారణ వేగవంతం చేయాలని కోరారు అంతేకాకుండా మృతి చెందిన వివేక్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని కోరారు అంతేకాకుండా ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయులను బాధ్యతతో పని చేయాలని మరియు పిల్లలను తమ పిల్లల వలె చూసుకొని వారి మంచి చెడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల బిజెపి అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు వెల్దండ రాజేంద్రప్రసాద్ గిరిజన మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్ మాజీ ఎంపీటీసీ కుంట మల్లయ్య పూజారి కృష్ణయ్య శ్రీనివాస్ బొల్లి సుధాకర్ గుజ్జల బాలరాజు పుట్ట కొమురయ్య నేరుగు రవీందర్ వంగ శ్రీనివాస్ రెడ్డి రాముల నాయక్ తదితరులు పాల్గొన్నారు
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025