న‌దీ జ‌లాల వాటాలో రాజీ ప్ర‌స‌క్తే లేదు : మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి..

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

న‌దీ జ‌లాల వాటాలో రాజీ ప్ర‌స‌క్తే లేదు : మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి..

కోదాడ, అక్టోబర్ 15/ మన ప్రజావాణి ప్రతినిధి

కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్ర‌భుత్వాలు ఉన్నప్పటికీ నది జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర‌ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ కాశీనాదం ఫంక్షన్ హాల్‌లో కోదాడ, హుజూర్‌న‌గ‌ర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును కూడా తాము వ్యతిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. ట్రిబ్యునల్‌కు హాజరైన తొలి మంత్రి తానేన‌న్నారు.ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని తెలిపారు. సూర్యాపేట జిల్లాకు దేవాదుల నుండి నీటిని రప్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్ఎల్‌బీసీ పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కృష్ణ జలాల వివాదంపై ట్రిబ్యునల్‌తో పాటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి పరిశీలకుడు సారత్ రౌత్, ఎమ్మెల్యే పద్మావతి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, పీసీసీ డెలిగేట్లు లక్ష్మీనారాయణ రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, రెండు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్