ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు* *మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలు నిర్వహించిన – నల్గొండ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి* *నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (మన ప్రజావాణి)

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు*

*మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలు నిర్వహించిన – నల్గొండ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (మన ప్రజావాణి)*:

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 – 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచాడు. కలామ్ ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశాడు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించాడు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచాడు. కలామ్ తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను రెండవ స్థానంలో ఎంపికైయ్యాడు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐ ఐ ఎమ్) షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, కలామ్ కుప్పకూలిపోయాడు. 2015 జూలై 27 న, 83 సంవత్సరాల వయసులో, గుండెపోటుతో మరణించాడు. తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు, అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కళాశాల అధ్యాపకుల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share