
తెలంగాణ ఆటో జాగృతి జిల్లా అధ్యక్షులుగా సురేష్ ను నియమించినట్లు ప్రకటన
హుస్నాబాద్ అక్టోబర్.16. ప్రజావాణి
తెలంగాణ జాగృతి సిద్దిపేట జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులుగా అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన గంపాల సురేష్ ను నియమించినట్లు గురువారం రోజున తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ తో కలిసి కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిసి పండ్ల బోకెను అందజేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. త్వరలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హుస్నాబాద్ నియోజకవర్గం రానుందని తెలిపారు. కవితను కలిసి ధన్యవాదలు చెప్పిన వారిలో హుస్నాబాద్ జాగృతి నాయకులు లకవత్ వెంకటేష్ నాయక్, అడుగంట్ల మొగిలి తదితరులు ఉన్నారు.









