
*బి సి బంద్ కి సంపూర్ణ మద్దతు*
*బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ బీసీ బందులో భాగస్వామ్యం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*:
శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీసీ 42 శాతం రిజర్వేషన్ 9 వ షెడ్యూల్లో చేర్చాలని జరుగుతున్న బీసీ బందు కి సంపూర్ణ నైతిక మద్దతు ప్రకటించిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా చండూరు మండలం ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ సంపూర్ణ మద్దతుతో మండల బీసీ సంఘాలు & అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలో శాంతియుతంగా బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి నేరెళ్ల లింగాయన్ మాట్లాడుతూ బీసీ లకు 42% రిజర్వేషన్స్ లొ చేర్చాలని మా పార్టీ శ్రేణులంతా బందు లో పాల్గొనడం జరిగింది, బీసీల గుండే ఘోష అఘోషను రగిలించిన వారిగా నిరసన బందు లో మేము భాగస్వామ్యం కావడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పార్లమెంటులో సమస్యని 9 వ షెడ్యూల్లో చేర్చి పరిష్కరించాలని పరిష్కరించని యెడల ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ కలిసి రాదు ఆ పార్టీల్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టి కొడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సి సంఘాల నాయకులు మధు గౌడ్, జగన్నాధం గౌడ్, మహ్మద్ హఫ్రొజ్, జావీద్, చండూరు మండల అధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు సుమన్, కార్యదర్శి రాజేష్, మండల నాయకులు మహేష్, వెంకటేష్, శంకర్, స్వామి లు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025