
*రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీల పై చూపెడుతున్న కపట ప్రేమ ను విడనాడాలి*
*బీసీల 42% రిజర్వేషన్ రాష్ట్ర బంద్*
*మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లా వెంకటేష్ మాదిగ*
*ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు మాదిగ*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*:
శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంధు కార్యక్రమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించిది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన న్యాయమైన 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేసి తీరాలి, ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ రిజ్వేషన్ పోరాట సంఘం పూర్తి మద్దతు చేస్తుంది. శనివారం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తున్నది అటు కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తున్నది మరి ఇక్కడ బీసీలకు న్యాయం చేయాల్సిందే. ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు బిల్లు పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ప్రకటించాలని అన్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే బీసీలకు న్యాయం చేయాలని ఉంటే అఖిలపక్ష పార్టీలను కేంద్రానికి వెళ్లి ఎందుకు ఒప్పించ కూడదు అని ప్రశ్నించారు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ డోల్ దెబ్బ రాష్ట్ర చైర్మన్ మలిగా యాదయ్య, ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నారపాక అంజనేయులు మాదిగ, ఉప అధ్యక్షులు అన్నెపాక శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కనగల్ మండల అధ్యక్షుడు జిల్లా శోభన్ మాదిగ, మహనీయుల పొలిటికల్ సంఘం కనగల్ మండల అధ్యక్షుడు అనిమల్ల స్వామి, ఉప అధ్యక్షులు అనిమల్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.









