అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)*:

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)*:

అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు కొన్ని కోట్ల మేర అమాయక ప్రజల వద్ద నుండి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీస్. అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తా…
జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

*నిందితుల వివరాలు*:

రామావత్ మధు తండ్రి సక్రు వయస్సు 21 సంవత్సరం కులము లంబాడి వృత్తి బిజినెస్ పలుగు తండ, వద్దిపట్ల గ్రామం, పెద్ద అర్చెర్లపల్లి మండలం. పల్త్య భరత్ కుమార్ తండ్రి రూప్సింగ్ వయసు 32 సంవత్సరాలు కులము లంబాడి వృత్తి బిజినెస్ ఇంటి నెంబర్ 11-58 విట్టు నాయక్ తండ గ్రామం, మాగూడెంపల్లి మండలం. ప్రస్తుతం ప్లాట్ నెంబర్ 81 చెన్నారెడ్డి కాలనీ జహీరాబాద్ టౌన్ సంగారెడ్డి జిల్లా.నగర బాబు తండ్రి తవ్వు వయస్సు 31 సంవత్సరం కులము లంబాడి వృత్తి ప్రైవేట్ జాబు వస్త్రం తండ గ్రామం, త్రిపురారం మండలం. ప్రస్తుతం మయూరి నగర్, మిర్యాలగూడ మండలం, సంగారెడ్డి. సభావత్ రమేష్ తండ్రి ఏం లా వయస్సు 36 సంవత్సరాలు కులము లంబాడి వృత్తి డ్రైవర్ అల్మాస్గూడ గ్రామం, బాలాపూర్ మండలం రంగారెడ్డి. రమావత్ రవీందర్ తండ్రి జోహార్ లాల్ వయస్సు 29 సంవత్సరాలు కులము లంబాడి వృత్తి బిజినెస్ పలుగు తండ వద్దిపట్ల గ్రామం పీఏ పల్లి మండలం. రమావత్ జోహార్ లాల్ తండ్రి బొజ్జయ్య వయస్సు 53 సంవత్సరాలు కులము లంబాడి వృత్తి బిజినెస్ పలుగు తండ, వద్దిపట్ల గ్రామం, పీఏ పల్లి మండలం. కడారి రాంప్రసాద్ తండ్రి లేట్ నరసింహ వయస్సు 26 సంవత్సరాలు కులం యాదవ్ వృత్తి కార్ డ్రైవర్ ఇంటి నెంబర్ 2- 50 శిర్దేపల్లి గ్రామం చండూర్ మండలం రవీందర్ నగర్ ఎదురుగా చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ నల్గొండ.
రమావతి గణేష్ తండ్రి ఆమ్రు వయస్సు 25 సంవత్సరాలు కులము లంబాడి వృత్తి రాపిడో రైడర్ గణేష్ పహాడ్ గ్రామం వాడపల్లి మండలం వద్దపల్లి నల్గొండ.

*నేరస్తులపై పైనా నమోదైన కేసుల వివరాలు*:

1. క్రైమ్ నెంబర్ 153 /2025 యు/ఎస్ 316(2),318(4) బి ఎన్ ఎస్, సెక్షన్ 5 ఆఫ్ టి ఎస్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. 1999 ఆఫ్ గుడిపల్లి పి ఎస్.
2. క్రైమ్ నెంబర్ 154 /2025 యు/ఎస్ 316(2),318(4) బి ఎన్ ఎస్, సెక్షన్ 5 ఆఫ్ టి ఎస్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. 1999 ఆఫ్ గుడిపల్లి పి ఎస్.
3. క్రైమ్ నెంబర్ 156/2025 యు/ఎస్ 316(2),318(4) బి ఎన్ ఎస్, సెక్షన్ 5 ఆఫ్ టి ఎస్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. 1999 ఆఫ్ గుడిపల్లి పి ఎస్.
4. క్రైమ్ నెంబర్ 157/2025 యు/ఎస్ 316(2),318(4) బి ఎన్ ఎస్, సెక్షన్ 5 ఆఫ్ టి ఎస్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. 1999 ఆఫ్ గుడిపల్లి పి ఎస్.

*నేరం చేయు విదానం*:

పలుగు తండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రామవత్ మధు నాయక్ పదవ తరగతి డి ఎ వి మోడల్ స్కూల్ పుట్టాంగండి లో కరోనా టైంలో పాసై చదువు అబ్బక ఇంటర్మీడియట్ లో చదువు ఆపినాడు. తరువాత ఫెర్టిలిజర్ షాప్ లో డిస్ట్రిబూటర్ గా వ్యవసాయానికి సంబందించిన కొత్త కొత్త మందులను నల్గొండ జిల్లా వివిద మండలాలకు మార్కెటింగ్ గురించి తిరిగేవాడు. ఆ క్రమంలో చాలామంది వ్యక్తులు పరిచయం అయినారు. ఇతని స్వంత గ్రామములొ అన్న వరస అయినటువంటి బాలాజి నాయక్ ఆధిక వడ్డీలు ఇస్తుండేవాడు. మొదటిలో అతని దగ్గర ఏజెంట్ గా పని చేసి తరువాత నేనే కంపెనీ పెట్టి డబ్బులు ఎందుకు వసూలు చేయకూడదని, మధు అతని బావలు భరత్, బాబు, రమేశ్ లు నిశ్చయించుకుని ఎలాగో మనమందరం ఆర్దికంగా వెనకబడి ఉన్నాము, మనం ఆర్దికంగా స్థిరపడలంటే నీవు కూడా బాలాజి కంటే ఆదిక వడ్డీ ఇస్తానని చెప్పి మా కంపెనీలలో పెట్టుబడులు పెట్టండి మీ డబ్బులను రెట్టింపు చేస్తానని నెల నెల ఆదిక మొత్తంలో వడ్డీలు ఇస్తామని మాయమాటలు చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇక్కడినుంచి పారిపోదామని చెప్పినాడు, దానికి పథకం ప్రకారం మధు జి ఎన్ ఐ (గోకులానందన్ ఇన్ఫ్రా ) అనే కంపెనీ, జహీరాబాద్ దగ్గర వెంచర్లు వున్నాయని అదే విదంగా హైదరాబాద్ లో పబ్బులు, స్పా సెంటర్లు, కర్నూల్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని డాకుమెంట్స్ ప్రజలకు చూపించి, బాలాజి కంటే అధికంగా నెలకు 15-18 రూపాయలు వడ్డీ ఇస్తామని ఆకర్షితమైన మాటలు చెప్పి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టినాడు, దానికిగాను కొందమంది ఏజెంట్లను నియమించుకుని, ఇలా వచ్చిన డబ్బులతో అతని బావల ఆదేశాల మేరకు ఆస్తులను కొనడం ప్రారంబించారు. ఈ డబ్బులతో 2025 జనవరి నెలలో హైదరాబాదులో గోకులనందన (జిఎన్) ఇన్ఫ్రా ఐడియా ప్రైవేట్ కంపెనీ అని ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసును ఏర్పరచుకొని నా యొక్క జీవన విధానంలో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా జీవన శైలిని మార్చుకొని లగ్జరీ లైఫ్ లో భాగంగా ఫార్చునర్ కారు కొని, అదేవిధంగా ఊర్లో జనాలకి నమ్మకం కలిగించడానికి పెద్ద ఇల్లు నిర్మించడము ప్రారంబించాడు, అప్పుడు ఊరి ప్రజలు ఇతని పేరును జనాల లోనికి నమ్మేవిదంగా తీసుకువెళ్లినారు. వీరిని చూసి మరి కొంత మంది ఏజెంట్లను పలుగు తండా, చుట్టూ ప్రక్కల గిరిజన తాండలు, గ్రామాల నుండి ఏర్పాటు చేసుకొని అదిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి వీరి వద్ద డబ్బులు తీసుకొని వారికి ప్రామిసరీ నోట్లు వ్రాసి ఇచ్చి నెలకు 10 రూపాయల వడ్డీ చెల్లించేవాడు. ఈ డబ్బులతో ఇతను, ఇతని బందువుల, స్నేహితుల పేర్లతో వ్యవసాయ భూములు, ఇండ్లు కరిదైన కార్లు, బైక్ లు కొని జల్సాలు చేసేవాడు. ఇంకా అదిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు 10 రూపాయల వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించి కోట్లలో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాదితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనుకల వడ్డీ ఇచ్చినట్లు వ్రాసి పాత ప్రామిసరీ నోటు తీసుకొని కొత్త ప్రామిసరీ నోటు అదే అసలు అమౌంట్ కి వ్రాసి ఇచ్చేవాడు. ఇలా వచ్చిన కోట్ల డబ్బులతో పబ్ అండ్ బార్, స్పా సెంటర్ కోసం సుమారు 2.5 కోట్లు,ఆన్ లైన్ ద్వార బయటి రాష్ట్రాలలో ఐ పి ఎల్ బెట్టింగ్ ద్వార 40 లక్షలు, స్టాక్ మార్కెట్ లో ఇంట్రా రోజు ట్రేడింగ్ చేసి 60 లక్షలు పెట్టిబడిపెట్టి నష్ట పోయినాడు. గత కొన్ని నెలలుగా బాదితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేక పోయే సరికి బాదితులు మధు పై వత్తిడి చేయడం ప్రారంబించారు. ఇన్ని డబ్బులు ఇవ్వలేక మధు బాదితుల నుండి తప్పిచ్చుకొని పారిపోయాడు. ఈ విషయం పైనా అక్టోబర్ మొదటి వారంలో బాదితుల పిర్యాదు మేరకు తెలంగాణ డిపాసిటర్ ఆక్ట్, చీటింగ్ కేసులు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి, రిమాండుకి తరలించడం జరిగినది. ఈ కేసులు అడిషనల్ యస్.పి ఆద్వర్యంలో విచారణ జరుగుతుంది. నేరస్తులని పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపరి విచారణ చేయడం జరుగుతుంది.
వారి వద్ద నుండి స్వాదీన పరుచుకున్న వివరాలు వారి పేరు పై, వారి బందువుల పేరు పై ఉన్న విలువైన ఆస్తికి సంబందించిన పత్రాలు. వెన్యూ కార్, క్రిటా కార్, ఐ 20 కార్, ఫార్చ్యూనర్ కారు. 9 సెల్ ఫోన్లు , ఆదేవిందంగా బాలాజి నాయక్ కేస్ లో ఏజెంట్లు అయిన అతని అన్న రవీందర్ తండ్రి జవాహర్ లాల్, గణేశ్, రామ ప్రసాద్, సట్టు నరేశ్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి థార్ వాహనం, ఎమ్ జి కార్, అల్టో కారు, ఆస్తులకు సంబందించిన విలువైన పత్రాలు ఫోన్ల ను, గోబ్బ్లర్ కంపెనీ కి చెందిన కాష్ కౌంటింగ్ మిషన్ స్వాధీనపరుచుకున్నము. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్.పి మాట్లాడతూ బాదితులు ఎవ్వరూ వత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, మద్యవర్తులను నమ్మి మోసపోవద్దు. బాడితులు నేరుగా వారి వద్ద ఉన్న పత్రాలను పోలీస్ వారిని సంప్రదిస్తే విచారణ చేసి నెరస్థుల ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share