
*గాయపడిన సుదర్శన్ కి ఆర్థిక సహాయం – తోకల వెంకన్న*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)*:
చండూర్ మున్సిపాలిటీ చెందిన సంగెపు సువర్ణ భర్త సంగెపు సుదర్శన్ గత మూడు రోజుల క్రితం నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకుండా కాంట్రాక్టర్ అధికారులు నిర్మించే డ్రైనేజీ నిర్మాణంలో పడి ఇనుప రాడ్లు సువ్వలు గుచ్చుకొని తీవ్రంగ గాయపడ్డారు. ఈ విషయం తెలిసి నల్గొండలోని ఐకాన్ హాస్పిటల్ నందు వారిని పరామర్శించి తక్షణమే ఆర్థిక సాయంగా చండూరు మండలం మాజీ ఎంపీపీ తోకల వెంకన్న15,000 /- రూపాయలు అందజేయడం జరిగింది.









