
*అక్టోబర్ 25 న చిట్యాల మండల కేంద్రంలో జరుగు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి*
*చౌగని సీతారాములు జిల్లా కార్యదర్శి నల్లగొండ*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)*:
సోమవారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి హాజరైన సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఈనెల 25 న చిట్యాల మండల కేంద్రంలో జరుగు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో రోజురోజుకు అనేక మార్పులు జరుగుతున్నాయని కల్లుగీత వృత్తిలో కూడా ఆధునికరం తీసుకురావాలని అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలని అన్నారు. జిల్లాలో తాటి ఈత చెట్ల సంపద ఉన్నదని ఈ జిల్లాలో 25 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు. ప్రకృతి ప్రాణయం మీరా ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాటి ఈత చెట్ల ద్వారా అనేక ఉత్పత్తులు ఉన్నాయి అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు సొసైటీలు వీచే వారికి చెట్టు పథకం పెన్షన్ చెట్ల పెంపకానికి భూమి మీరా కేప్ ప్రమాద నిర్వహణకు సేఫ్టీ కిట్లు లాంటి కొన్ని సమస్యలు సాధించుకున్నామని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయుటకై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పామునుగుండ్ల అచ్చాలు, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేములకొండ పుల్లయ్య, ఉప్పల గోపాలు, కొప్పుల అంజయ్య, సహాయ కార్యదర్శి లింగస్వామి, జేరుపోతుల ధనంజయ్, తదితరులు పాల్గొన్నారు.









