
పెండింగ్ బడ్జెట్ బిల్లుల విడుదలకు మోక్షం లభించేనా…?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన గత ఆర్థిక సంవత్సరం 2024 25 చివరి ప్రైమాసికం జనవరి నుండి ఈ ఆర్థిక సంవత్సరం 2025 26 మూడవ త్రైమాసికం అక్టోబర్ నెల వరకు బడ్జెట్ కు సంబంధించిన కార్యాలయాల ఖర్చులు మరియు ఇతర ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ బిల్లులు ఇంతవరకు కనీసం 50 వేల వరకు అయినా పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయకపోవడం బహుశా ఇదే మొదటిసారి గతం ఎప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొల్ప బడలేదు ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి 50 వేల వరకు ఉన్న పెండింగ్ బడ్జెట్ బిల్లులను వెంటనే విడుదల చేసి షాపు యజమానులకు మరియు ఉద్యోగ ఉపాధ్యాయ మరియు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులకు ఉపశమనం కలిగించగలరని కోరుతున్నారు గత పది నెలల నుండి పెండింగ్ బడ్జెట్ బిల్లులను విడుదల చేయకపోవడం చాలా శోచనీయం దయచేసి ఇప్పటికైనా ఆర్థిక శాఖ అధికారులు అర్థం చేసుకొని పెండింగ్ బడ్జెట్ బిల్లులు కనీసం 50 వేల వరకు ఉన్న వాటిని విడుదల చేయాలని కోరుతున్నారు









