
*మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకోని అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 32 ఏళ్ల జైలు, 75 వేల జరిమాన*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (మన ప్రజావాణి)*:
నల్లగొండ పట్టణం పానగల్ కి చెందిన గురజాల చందు తండ్రి రాజు,15 సంవత్సరాల మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా పెళ్లి చేసుకొని శారీరకంగా వాడుకున్న తరువాత వదిలేసిన ఘటన పై నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుడి పైన క్రైమ్.నెంబర్. 270/2022 ఎస్సీ. నెంబర్.230/2022 యు/ఎస్ 366, 376(2)(ఎన్)(i)(3) ఐపిఎస్ & సెక్షన్ 5(I) ఆర్ /డబ్ల్యూ 6 ఆఫ్ ఫోక్సో యాక్ట్ -2012 & సెక్షన్.9 ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రోహిబిటెషన్ యాక్ట్-2006 క్రింద కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్ సీట్ దాఖలు చేయగా బుధవారం ఎడిజె-II కమ్ ఎస్సీ/ఎస్టీ కోర్టు & అత్యాచారం, ఫోక్సో కేసుల కోర్ట్ నిందితునికి దోషిగా నిర్ధారించి, పోక్సో యాక్ట్ క్రింద 20 సంవత్సరాలు, 25 వేల జరిమాన. సెక్షన్ 366 ఐపిఎస్ క్రింద 10 సంవత్సరాల జైలు 25 వేల రూపాయల జరిమాన. బాల్య వివాహ నిషేధ చట్టం కింద 2 సంవత్సరాల జైలు 25 వేల జరిమానా. మొత్తం కలిపి 32 సంవత్సరాల జైలు 75 వేల రూపాయల జరిమాన బాధితురాలికి డి ఎస్ ఎల్ ఎ ద్వారా 10 లక్షల రూపాయలు పరిహారం అందించాలని తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరించిన కె.శివరాం రెడ్డి నల్గొండ డిఎస్పీ, రాఘవ రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్సై సైదులు టు టౌన్ పోలీస్ స్టేషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సిడిఒ సుమన్, లీగల్ ఆఫీసర్ బరోసా సెంటర్ కె.కల్పన, లైజెన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025