
*రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సామాజిక బాధ్యతగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బ్యారీ కెడ్ ను సక్రమంగా పెట్టిన యువకులను అభినందించిన డీఎస్పీ శివరాం రెడ్డి నల్లగొండ*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (మన ప్రజావాణి)*:
మంగళవారం రాత్రి నల్లగొండ హైదరాబాద్ రోడ్ లో ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఎస్పీ ఆఫీసు వద్ద గాలికి అడ్డంగా పడి ఉన్న ట్రాఫిక్ బ్యారి గేడ్ గమనించి అటుగా వెళ్తున్న యువకులు కంభంపాటి రాకేష్, చంద్రగిరి క్రాంతి కుమార్ ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్త గా, సామాజిక బాధ్యతగా తెలుసుకొని వాటిని యధాస్థానం లో పెట్టటం జరిగింది. ట్రాఫిక్ పోలీసుకి వారు రాత్రి సమయం లో సహాయం చేసినట్లుగా ఇది గమనించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఈ రోజు అభినందించారు. అలాగే వారి ఆదేశాల మేరకు ఈ రోజు డీఎస్పీ శివరాం రెడ్డి తన కార్యాలయంలో యువకులను సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డుకు అడ్డంగా పడిపోయిన బారికేడ్స్ పట్టణానికి చెందిన యువకులు గమనించి వాహనదారులు, ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా సామాజిక బాధ్యతగా పడిపోయిన వాటిని సక్రమంగా ఉంచి ప్రమాదాలు నివారించడం కూడా ఒక సామాజిక బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రజల కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోలీస్ వారికి సహకరించాలని పేర్కొన్నారు. అలాగే పట్టణంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనదారులు మద్యలోనే యూ టర్న్ తీసుకోకుండా కేటాయించిన మార్గం గుండా ఒక సక్రమైన పద్ధతిలో వెళ్ళాలనీ తెలిపారు. ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద యూటర్న్ తీసుకోనే క్రమంలో షార్ట్ టర్న్ లో వాహనాలను మలపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన విధంగా జంక్షన్ లో యూటర్న్ తీసుకోనీ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ సిఐ మహా లక్ష్మయ్య,నార్కట్పల్లి సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025